Rahul Gandhi: కరీంనగర్ V-పార్క్ నుంచి మూడో రోజు కాంగ్రేస్ విజయ భేరి యాత్ర ప్రారంభమైంది. జగిత్యాల కార్నర్ మీటింగ్ లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ బయలుదేరారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ మార్గం మధ్యలో నూకపల్లి NAC స్టాప్ వద్ద రాహుల్ గాంధీ ఆగారు. స్కూటీపై వెళుతున్న ప్రయాణికులతో ముచ్చటించారు. చిన్నారులకు చాక్లెట్స్ అందించారు. రాహుల్ ని చూసిన ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరారు. అయితే వారితో మాట్లాడిన రాహుల్ పక్కనే వున్న టిఫిన్ బండి వద్దకు వెళ్లారు. దోశ తినాలంటే ఎంత డబ్బు కట్టాలంటూ హాస్యాస్పదం చేశారు. నువ్వు కాదు నేను కూడా దోసె వేయొచ్చా.. అని అడిగారు. బండి వద్ద దానికేమి భాగ్యం వేయండి సార్ అంటూ పక్కకు జరిగాడు. నాకు దోస వేయడం రాకపోతే నేర్పిస్తావా అంటూ అనడం కాసేపు అక్కడి వాతావరణం అంతా నవ్వులపువ్వుల కురిపించారు రాహుల్. అయితే రాహుల్ దోస పిండి తీసుకుని దోసె వేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఎప్పుడు సభలు, సమావేశాలు అంటూ తిరుగుతూ తినడానికి కూడా టైమింగ్ లేక ప్రజలకోసం సమయాన్ని కేటాయించే రాహుల్ ఇలా ప్రజల్లో ఉండి వారిలో ఒకరై ప్రచారంలో ముందుకు సాగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాసేపు ఆ బండి వద్దనే ఉండి దోసెని అక్కడి నుంచి జగిత్యాలకు పయనం అయ్యారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జనసమితి పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బస్సుయాత్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని జనసమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ కలిశారు. ప్రస్తుతం కరీంనగర్ లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీతో కోదండరామ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ ను రాహుల్ గాంధీ కోరినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ముదోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను గెలవాలని జన సమితి భావిస్తోంది. రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని దాన్ని అంతమొందించేందుకు పొత్తులపై చర్చించామని అన్నారు. తదుపరి విషయాలు త్వరలో తెలియజేస్తామన్నారు. కోదండరాంతో సమావేశం అనంతరం జగిత్యాల కార్నర్ మీటింగ్ లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ బయలుదేరారు.
MLA Lakshma Reddy: అభివృద్ధి వైపే మా పయనం.. లక్ష్మారెడ్డికే మా మద్దతు