Site icon NTV Telugu

Rahul Gandhi: కొండగట్టు సందర్శన వాయిదా.. నేరుగా ఆర్ముర్ కి రాహుల్..

Rahul Gandi Dilhi

Rahul Gandi Dilhi

Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నేడు నిజామాబాద్‌లో సాయంత్రం జరగాల్సిన పాదయత్ర క్యాన్సిల్ అయింది. ఇవాళ ఆర్మూరులో పసుపు, చెరుకు రైతులతో రాహుల్ ముఖాముఖీ సమావేశం అవుతారు. అనంతరం బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో షెడ్యూల్ కుదింపు చేశారు అధికారులు. దీంతో కొండగట్టు సందర్శన వాయిదా పడింది. కరీంనగర్ నుండి జగిత్యాలకి నేరుగా వెళ్లనున్నారు. అనంతరం అక్కడే కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్నారు. కోరుట్లలో కార్నర్ మీటింగ్ లో పార్టీ శ్రేణులతో మాట్లాడి అక్కడే మధ్నాహ్న భోజనం చేయనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆర్ముర్ కి రాహుల్ పయనం కానున్నారు. మధ్నాహం 2.30 కి సభలో పాల్గొని మాట్లాడనున్నారు. సభ అనంతరం హెలికాప్టర్ లో హైదరాబాద్ కి వచ్చి అక్కడనుంచి కమర్షియల్ ఫ్లైట్ లో ఢిల్లీకి రాహుల్ పయనం కానున్నారు.

నేడు రాహుల్ షెడ్యూల్..

ఇవాళ ఉదయం 8.30 గంటలకు కరీంనగర్ లోని వీపార్క్ హోటల్ నుంచి బయలుదేరనున్న రాహుల్ గాంధీ ఉదయం 9 గంటలకు చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర దగ్గర సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతం మధ్యాహ్నం 12గంటలకు వేములవాడ నియోజక వర్గం మేడిపల్లిలో సమావేశంలో పాల్గొననున్నారు. కోరుట్లలో మధ్యాహ్నం 1గంటకు కోరుట్ల వేములవాడ నియోజకవర్గం మేడిపల్లి మండల కేంద్రం లో కార్యకర్తలకు అభివాదం చేయనున్న రాహుల్ గాంధీ. మధ్యాహ్నం 1.30 గంటలకు ముక్కస్ కన్వేషన్ లో భోజన విరామం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ తలపెట్టిన సభలో పాల్గొని రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. కాగా ఆర్మూర్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ముధోల్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణ రావు పాటిల్ నేతలు హస్తం గూటికి చేరనున్నారు. ఆర్మూర్ పట్టణంలో రాహుల్ పెద్ద ఎత్తున అభిమానులు రానున్న నేపథ్యంలో భారీ ఏర్పట్లు చేశారు. రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ట్రాఫిక్ ను మళ్లించారు అధికారులు.

Exit mobile version