రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ రాచకొండ పోలీసులకు ఆక్సిజన్ సిలిండర్ల ను అందజేశాయి పలు సచ్చంద సంస్థలు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారు రాచకొండ పోలీసులను సంప్రదించవచ్చు అని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. 9490617234 కు ఫోన్ చేసి వాట్సప్ లో డీటైల్స్ ఇస్తే ఆక్సిజన్ సిలిండర్లను ఇంటికే అందజేస్తారు అని అన్నారు. పేషంట్ వివరాలు డాక్టర్ ప్రిస్కిప్షన్ చూపిస్తే ఆక్సిజన్ సిలిండర్ల ఇంటికి పంపిస్తాం. ఫస్ట్ ఫేస్ తో పోలిస్తే సెకెండ్ ఫేస్ లో చాలా వేగంగా వైరస్ పాకుతుంది. ప్లాస్మా దానం కు కోలుకున్న వ్యక్తులు ముందుకు రావాలి. ప్లాస్మా దాతలు RKSC.donateplasma.in లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్లాస్మా దానం కు యువత ముందుకు రావాలి. నేను కూడా ప్లాస్మా దానం చేసేందుకు ఉన్న A+ve ప్లాస్మా కావాలంటే నేను ఇస్తాను అని రాచకొండ సీపీ పేర్కొన్నారు.