నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న షాపులు, గోదాముల పై సోదాలు చేసారు పోలీసులు. దీని పై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ… హయత్ నగర్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాలు షాపుల పై దాడులు చేసాం. హయత్ నగర్ లోని పసుమాముల గ్రామంలో నకిలీ విత్తనాలు 60 లక్షల సీజ్ చేసాం. పత్తి, మిర్చి ,వేరుశెనగ ఏక్స్పెర్ డేట్ ముగిసిన విత్తనాలు విక్రయిస్తున్నారు. గారినేని పాని గోపాల్ యజమాని పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసాం అని అన్నారు. మునుగునూర్ లో గోపాల్ సీడ్స్ బిజినెస్ ఉంది. రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిసస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గత నాలుగు సంవత్సరాలు గా 10 మంది పై పిడి యాక్ట్ నమోదు చేసాం. ఎస్వోటి టీమ్, తో పాటు అగ్రీకల్చరల్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించాము. గోపాల్ పై కూడా పిడి యాక్ట్ నమోదు చేస్తాం అని తెలిపారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న షాపులుపై సోదాలు…
Show comments