Python stirs in Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కిష్టారం గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అసలే వానలతో అల్లాడుతున్న జనాలకు గ్రామంలో కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. అసలే చీకటి, ఆపై వర్షం.. ఆరాత్రి నిద్రలోకి జారుతున్న జనాలకు ఉలిక్కిపడేలా చేసింది. కొండ చిలువ. కిష్టారం గ్రామంలో కొండ చిలువ తిరుగుతుందనే వార్తతో గ్రామస్తులు భయాందోళకు గురయ్యారు. రాత్రి సుమారు 10 అడుగులకు పైగా వున్న ఆకొండ చిలువ రోడ్డుపై నుంచి పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లింది.
Read also: Running train incident: విషాదం.. కూతురు మరణం తట్టుకోలేక తండ్రి
దీంతో ఇంట్లో వున్న కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీసారు. గ్రామస్థులు అటవీశాఖ సిబ్బందిని సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న విశ్రాంత ఎఫ్బీవో మెహమూద్ కొండ చిలువను చాక చక్యంగా పట్టుకున్నాడు. గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. సింగరేణి వలన అడవి నరకటంతో విష సర్పాలు జానావాసాల్లోకి వస్తున్నాయి అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ జంతువు ఎక్కడ దాడి చేస్తుందో అని భయం వేస్తుందని వాపోతున్నారు. రాత్రి సమయంలో బయటకు తిరగాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Earthquake: ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో భూకంపం