పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి నిరసన సెగ తగిలింది. కమలాపూర్ మండలం భీంపెల్లిలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని నిలదీశారు గ్రామస్థులు. డబుల్ బెడ్ రూమ్, పించన్, దళితులకు మూడెకరాల భూమి ఎదని నిలదీశారు భీంపెల్లి గ్రామస్థులు. రైతులకు రైతుబందు, భీమా ఇచ్చి ఏ భూమి లేని పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం ఇచ్చిందని నిలదీశారు పేదలు. ఇక్కడే కాదు గ్రామ, గ్రామాన టిఆర్ఎస్ నాయకులను నిలదీస్తున్నారు గ్రామస్థులు. అయితే గ్రామస్థులు నిలదీస్తున్న విజువల్స్ చిత్రీకరించే పాత్రికేయులపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అక్కస్సు వెళ్లగక్కారు. అలాగే నిలదీసిన పేదలపై అసహనం వ్యక్తం చేశారు చల్ల ధర్మారెడ్డి. దీంతో చల్లా ధర్మారెడ్డి ప్రవర్తన పట్ల విపక్షాలు మండిపడుతున్నాయి.
పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డికి నిరసన సెగ..
