Prof Kodandaram Pressmeet On TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ కేసు సిట్‌కు ఇవ్వడం వల్ల ఎలాంటి లాభం లేదని.. సీబీఐకి ఇవ్వాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది కేవలం ప్రవీణ్, రాజశేఖర్‌ది కాదని.. పేపర్ సెట్టింగ్‌కి, ప్రింటింగ్‌కు ఛైర్మన్‌ది బాధ్యత అని అన్నారు. తమకు వచ్చిన నోటీసులకు వెనక్కు తీసుకోవాలని కోరారు. సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపితే.. తమ ఆధారాలు సమర్పిస్తామని చెప్పారు. బలమైన హస్తం లేకుండా పేపర్ లీకేజ్ కాదని.. కేవలం ఇద్దరు కలిసి ఈ పేపర్‌ని లీక్ చేయలేదని అభిప్రాయపడ్డారు. పేపర్ లీకేజ్‌ని అరికట్టడం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు.
Revanth Reddy: TSPSC పేపర్ లీక్ కేసుని.. పనోళ్లతో క్లోజ్ చేసే కుట్ర చేస్తున్నారు
చాలా సింపుల్‌గా మెటీరియల్ ఇస్తాం, ఫుడ్ పెడతాం అంటే కుదరదన్న కోదండరాం.. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్ళు, నిధులు, నియామకాలు వల్ల అని.. కానీ అవన్నీ దారితప్పాయని మండిపడ్డారు. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్‌ది అని, మొత్తం అధికారాలు ఆయన దగ్గరే ఉన్నాయని ఆరోపించారు. సొంతంగా అధికారాలు చెలాయించే అధికారం ఏ అధికారికి లేదన్నారు. నాకేం సంబంధం అంటూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరం కలిసి కొట్టాడాలి, పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో ప్రజలందరిని భాగస్వామ్యం చేయాలన్నారు. మీ పైసలు గెలుస్తాయో.. మా పోరాటాలు గెలుస్తాయో చూద్దామని సవాల్ విసిరారు.
Jammu Kashmir Budget: మూజువాణి ఓటుతో జమ్మూకశ్మీర్ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం
ఈ టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం వ్యవహారం కేవలం ఇద్దరు వ్యక్తుల సమస్య కాదన్న కోదండరాం.. అందులో పాలకులకు సంబంధం ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ కూూడా ఈ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహించాల్సిందేనన్నారు. కేసీఆర్ సర్కార్ 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ అరాచకాలపై ఐక్యంగా ఉద్యమం చేసి తీరుతామని ప్రకటించారు.