Madapur Gun Controversy: మాదాపూర్ గన్ హాల్ చల్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ లోని సర్వే నెంబర్ 10 లో రియల్టర్ సంజీవ్ రెడ్డి గన్ తో బెదిరింపులు పాల్పడ్డాడు. నిర్మాణంలో ఉన్న భూమిలో తనకు కాంట్రాక్ట్ దగ్గలేదని కోపం పెంచుకున్న సంజీవ్ రెడ్డి. దీంతో.. కాంట్రాక్ట్ చేస్తున్న సుబ్బయ్య పై గన్ తో బెదరించాడు. పనిచేయకుండా వదిలి వెళ్లాలని గన్ పెట్టి బెదరించాడు. గన్ తో హాల్ చల్ వివాదంలో సురేష్ బాబుకి సంబంధం లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఉద్దేశపూర్వకంగానే సంజీవ్ రెడ్డి నిర్మాత సురేష్ బాబు పేరు ఉపయోగించుకుంటున్నాడంటున్న బాధితుడు చెబుతున్నాడు. సంజీవ్ రెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు గన్ ను సీజ్ చేశారు.
Read also:Kodali Nani: జగన్ పిల్లి కాదు.. పులి.. తెలియకపోతే ఆహారం అయిపోతావ్..!
బాధితుడు సుబ్బయ్య మాట్లాడుతూ.. మాదాపూర్ లోని సర్వే నెంబర్ 10 లో రియల్టర్ సంజీవ్ రెడ్డి గన్ తో బెదిరింపులకు దిగాడని పేర్కొన్నాడు. పక్కన ఉన్న ల్యాండ్ లో సంజీవ్ రెడ్డి డౌలప్ మెంట్ కి ల్యాండ్ తీసుకున్నాడని తెలిపారు. ఈ ల్యాండ్ కూడా తనకే కాంట్రాక్ట్ ఇవ్వాలని గతంలో ల్యాండ్ ఓనర్ ను కోరాడని వివరించారు. సంజీవ్ రెడ్డికి ల్యాండ్ ఓనర్ కాంట్రాక్టు ఇవ్వడానికి నిరాకరించాడని తెలిపాడు. దీంతో తనకు ల్యాండ్ లో కన్స్ట్రాక్షన్ చేయమని అప్పగించారన్నారు. దీంతో తనపై కక్ష పెట్టుకొని రాత్రి వెపన్ తీసుకొని సంజీవ్ రెడ్డి నాపై కాల్పులు చేయాలని చూశాడని పేర్కొ్‌న్నాడు. గన్ లోడ్ చేసుకొని నాపై బెదిరింపులకు దిగడంతో నేను అడ్డుకున్నానని, తనకు రియల్టర్ సంజీవ్ రెడ్డి వలన ప్రాణా హానీ ఉందని .. ఈ ల్యాండ్ కి నిర్మాత సురేష్ బాబు కి ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు బాధితుడు సుబ్బయ్య. సురేష్ బాబు ల్యాండ్ ను సంజీవ్ రెడ్డి డౌవలప్ మెంట్ కి తీసుకున్నాడు కాబట్టే వారి పేరును ఉపయోగించుకుంటున్నాడని తెలిపాడు. వాళ్లకు సురేష్ బాబుతో ఎలాంటి విబేధాలు లేవని, సురేష్ బాబు కూడా సంజీవ్ రెడ్డి వ్యవహారంపై ఫిర్యాదు చేశానని పేర్కొన్నాడు.
Read also: Saudi Arabia: వెడల్పు 200 మీటర్లు, పొడవు 170 కిలోమీటర్లు.. మెగాసిటీని నిర్మిస్తున్న సౌదీ..
గన్ హల్చల్ కేసులో Ntv తో మాదాపూర్ డి.సి.పి శిల్పవల్లి మాట్లాడారు. గన్ సీజ్ చేసి 447,506 arms act కింద కేసు నమోదు చేశామన్నారు. మాదాపూర్ సర్వేనెంబర్ 10 లో రామకృష్ణారెడ్డికి ల్యాండ్ ఉందని, ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన కాంపౌండ్ వాల్ కు మరమ్మతులు చేస్తున్నాడని అన్నారు. ప్రహరి గోడ నిర్మాణ పనులను సంజీవరెడ్డి వచ్చి అడ్డుకున్నాడని, ఈ క్రమంలోనే సంజీవరెడ్డి తన వెపన్ తీసి బెదిరించాడని శిల్పవల్లి పేర్కొన్నారు. రామానాయుడు స్టూడియో సూపర్వైజర్ ఈ స్థల వివాదంలో మాకు ఒక ఫిర్యాదు చేశాడని, సివిల్ ఇష్ష్యు కాబట్టి కోర్టులో చూసుకోవాలని చెప్పామన్నారు. ఇంతలోనే సంజీవరెడ్డి అక్కడికి వెళ్లి కాంట్రాక్టర్ సుబ్బయ్య తో గొడవపడి వెపన్‌తో బెదిరించాడని, సంజీవరెడ్డి పై గతంలో కడపలో ఒక కేసు నమోదయిందని డిసిపి శిల్పవల్లి తెలిపారు.
Pooja Hegde: అట్లుంటది పూజహెగ్దే అంటే.. అంతలా అయినా ఆపని బుట్టబొమ్మ
