NTV Telugu Site icon

Priyanka Gandhi: కర్ణాటక గురించి మాట్లాడటం కాదు.. తెలంగాణలో ఏం చేశారు.. కేసీఆర్‌ పై ప్రియాంక ఫైర్‌

Priyanka Gandhi Kcr

Priyanka Gandhi Kcr

Priyanka Gandhi: కర్ణాటక గురించి మాట్లాడటం కాదు.. 10ఏళ్లుగా తెలంగాణలో ఏం చేశారు కేసీఆర్‌ గారూ.. అంటూ ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. ” కాంగ్రెస్ విజయభేరి యాత్ర ” ఖానాపూర్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. క్రికెట్ వల్డ్ కప్ ఉన్నపటికీ నాకోసం వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ జల్ జంగిల్ జమీన్ కోసం కొట్లదినవరు ఉన్నారన్నారు. ఆదివాసీ సమాజం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను పెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు పక్క పట్టాలను ఇచ్చిందన్నారు. ఇందిరాగాంధీ చనిపోయి 40 సంవత్సారాలు ఔతున్న ఆమె అందరి మదిలో ఉన్నారని అన్నారు. ఇందిరా గాంధీ చేసినా మంచి పనులే ఆమెని మీకు దగ్గర చేశాయనిత తెలిపారు. మీరు ఇచ్చిన అధికారాన్ని అంతే బాధ్యతగా కాంగ్రెస్ నిర్వహించిందని తెలిపారు. తెలంగాణా ప్రజల ఇబ్బందులు చూసి స్వరస్వం ఇచ్చిందని తెలిపారు. తెలంగాణా ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ ఆగం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా ఏ ఉద్దేశంతో ఇచ్చారో అది నెరవేర్చలేదని మండిపడ్డారు.

Read also: Kotha Manohar Reddy: పల్లెల్లో అడుగడుగున ఘన స్వాగతం.. కొత్త మనోహర్ రెడ్డి కి జై కొడుతున్న జనం

కేసీఆర్ ప్రభుత్వములో నిరుద్యోగుల సమస్యలు తీరలేదని అన్నారు. కేవలం కేసీఆర్ కూ మాత్రమే కుటుంబం కూ ఉద్యోగాలు వచ్చాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వము లొ నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరగాయన్నారు. తెలంగాణా ఉద్యమం లో పాల్గొన్న ప్రతి కుటుంబం లో ఉద్యోగం వస్తుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్నీ ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని సమస్యలు తీరుతాయన్నారు. ధరణి పోర్టల్ తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని రకాల పంట దాన్యం ధరలు పెంచి రైతులను ఆదుకుంటామమన్నారు. వ్యాపార వేత్తలకు భారీ రుణ మాఫీలను చేసారు.. రైతులకు చేయాలన్నారు. తెలంగాణ రైతులు, రైతు కూలీలు, కార్మికులు అందరికీ అన్యాయం జరిగిందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వము తప్పులను బీజేపీ ప్రశ్నించదు అని మండిపడ్డారు. కేసీఆర్, బీజేపీ రెండూ ఒక్కటే ప్రజలు గమనించాలని తెలిపారు. రైతులకోసం వచ్చిన నల్ల చట్టాలకు కేసీఆర్ మద్దతు తెలిపారన్నారు. తెలంగాణలో బీజేపీ సపోర్ట్ చేస్తే ఢిల్లీలో బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకోసం ప్రత్యేక పథకాలను తీసుకు వస్తామన్నారు.
Bollywood : గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ‘ధూమ్’ డైరెక్టర్.