NTV Telugu Site icon

Gandhi Movie: గాంధీ సినిమాచూస్తుండగా టీచర్‌ అసభ్య ప్రవర్తన.. చితకబాదిన విద్యార్థుల పేరెంట్స్‌

Gandhi Cinima

Gandhi Cinima

గురుబ్రహ్మ..గురు విష్ణు..గురుదేవో మహేశ్వరః ఇది గురువుపట్ల మనం నేర్చుకున్నంది, విన్నది. కానీ విద్యాబుద్ధులు నేర్పే గురువుకు ఆ భగవంతునితో సమానంగా సమాజంలో స్థానం కల్పించినంతటి ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు కొందరు ఆ వృత్తికే కళంకం తెచ్చే విధంగా దారి తప్పుతున్నారు. విద్యార్థుల పట్లు అసభ్యంగా ప్రవర్తించిన గురువును తల్లిదండ్రులు దేహశుద్ది చేసిన ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో చోటుచేసుకుంది.

ఒక మంచి సినిమాని విద్యార్థులకు చూపించాలని ప్రభుత్వం నిర్ణయం చేస్తే ఆ సినిమాను చూపించే నెపంతో ఓ ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థనిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఇది తెలిసిన తల్లిదండ్రులు ఆ ప్రధానో పాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో జరిగింది. కేజీ సిరిపురం గ్రామానికి సంబంధించిన పాఠశాల నుంచి నిన్న వైరాలో గాంధీ సినిమా కోసం తీసుకుని వెళ్లారు. థియేటర్లో విద్యార్థుల మధ్య కూర్చొని ప్రధానో పాధ్యాయుడు రామారావు అసభ్యకరంగా ప్రవర్తించారు. రామారావు గతంలో ఎంఈఓ గా కూడా పనిచేశాడు రామారావు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాన్ని నిన్న రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత విద్యార్థినిలు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థినిల సమాచారంతో గ్రామస్తులంతా ఈరోజు పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడిపై దాడికి గ్రామస్తులు ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ప్రధానోపాధ్యాయుడు అక్కడి నుంచి పారిపోయి సర్పంచ్ ఇంటిలో తలదాచుకున్నాడు. దీంతో గ్రామస్తులంతా సర్పంచ్ ఇంటిని చుట్టుముట్టారు. ప్రధానోపాధ్యాయుడిని అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Vundavall Sridevi : వైసీపీలో వివాదాల ఎమ్మెల్యే శ్రీదేవికి పార్టీ చెక్ పెడుతుందా..?