NTV Telugu Site icon

MODI Tour: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని.. హై ప్రొటెక్షన్ జోన్‌లో ఆలయ పరిసరాలు

Modi Pm Warangala Tour

Modi Pm Warangala Tour

MODI Tour: వరంగల్ లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీ ఈ ఉదయం వరంగల్‌లోని మామనూరు ఎయిర్‌స్ట్రిప్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గంలో భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీకి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ప్రధాని మోడీ గో సేవలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు చేశారు.

Read also: Modi v/s KCR: ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం.. తలసానికి బాధ్యతలు

ప్రత్యేక పూజల అనంతరం వేదపండితులు మోడీకి ఆశీర్వచనం పలికారు. ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని కూడా అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కూడా భద్రకాళి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అలాగే గర్భగుడి వద్ద 5 నిమిషాల పాటు ధాన్యం తయారు చేసినట్లు తెలుస్తోంది. భద్రకాళి అమ్మవారి ఆలయంలో మోడీ వెంట కేవలం అధికార యంత్రాంగం, అర్చకులు మాత్రమే ఉన్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో భద్రకాళి అమ్మవారి ఆలయ పరిసరాలు హై ప్రొటెక్షన్ జోన్‌లోకి వెళ్లాయి. అమ్మవారి ఆలయాన్ని కూడా అందంగా అలంకరించారు.

Show comments