PM Modi: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మరోసారి తెలంగాణలో పర్యటించారు. వేములవాడ, వరంగల్‌లో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయన రాజ్ భవన్ లో కాసేపు విశ్రాంతి తీసుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వేములవాడకు బయలుదేరారు. వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న ఆలయంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి విజయం పక్కాగా కనిపిస్తోందన్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్ అడ్రస్ కూడా కనిపించడం లేదన్నారు.
Read also: North Korea: ఉత్తర కొరియాలో విషాద ఛాయలు.. కిమ్ కీ నామ్ మృతి..
పదేళ్లుగా నా పనితీరు ఎలా ఉందో మీరంతా గమనించారన్నారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని తెలిపారు. రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మనదేశం చేరిందన్నారు. మీరంతా బీజేపీకి ఓటు వేసిన కారణంగానే దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. మన దేశంలో ఎంతో సమర్ధత ఉన్నా ఇన్నేళ్లు కాంగ్రెస్ ఆ సామర్థ్యాన్ని నాశనం చేసి సమస్యల వలయంగా మార్చిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తేడా ఏమీ లేదు.. ఆ పార్టీలను ఓడించి తెలంగాణను కాపాడుకోవాలన్నారు. మూడో దశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్, ఇండియా కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయిందని తెలిపారు.
Mallu Bhatti Vikramarka: నేడు నిర్మల్ జిల్లాకు భట్టి విక్రమార్క.. షెడ్యూల్ ఇదే..