Site icon NTV Telugu

President Schedule Today: తెలంగాణాలో రాష్ట్రపతి పర్యటన.. నేటి షెడ్యూల్‌ ఇదే..

Dropadi Murmu

Dropadi Murmu

President Schedule Today: శీతాకాల విడిది నిమిత్తం సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ముర్ముకు సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సత్కరించారు. రాష్ట్రపతి ఐదు రోజుల పర్యటన నేపథ్యంలో నేటి షెడ్యూల్‌ ఇదే..

నేటి షెడ్యూల్‌..

ఉదయం 10.20 – 11.30 నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశంకానున్నారు.

మధ్యాహ్నం 3.00- 4.00 సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతోపాటు భూటాన్, నేపాల్, మారిషస్ మాల్దీవుల దేశాల అధికారులతో సమావేశంలో మాట్లాడనున్నారు.

4.15 నుండి 4.35 వరకు మిశ్ర ధాతు నిగం లిమిటెడ్(మిథాని) లో వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్ ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.

డిసెంబర్‌ 28

ఉదయం 10.40 – 11.10 భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ సందర్శన. ప్రసాద్ పథకం ప్రారంభం. అనంతరం మిశ్ర ధాతు నిగం లిమిటెడ్(మిథాని)కి సంబంధించిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్ ను వర్చువల్ లు ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 3.00-3.30 వరంగల్‌లోని రామప్ప ఆలయ సందర్శన. ప్రసాద్ ప్రాజెక్టు ప్రారంభం… ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన

డిసెంబర్‌ 29

ఉదయం 11.00-12.00 షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శన. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం.

సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి (శ్రీ రామానుజాచార్య) విగ్రహ సందర్శన

డిసెంబర్ 30

ఉదయం 10.00-11.00 రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగం.

అనంతరం సాంస్కృతిక మంత్రిత్వశాఖ, శ్రీ రామ చంద్ర మిషన్ కలిసి చేపడుతున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమం ప్రారంభం.

మధ్యాహ్నం 1.00గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విందు ఇవ్వనున్న రాష్ట్రపతి

Bhakthi Live: మంగళవారం నాడు ఇంట్లో భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రం వింటే..?

Exit mobile version