Site icon NTV Telugu

Draupadi Murmu: దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో కంబైన్డ్‌ గ్రాడ్యేషన్‌ పరేడ్‌.. హాజరైన రాష్ట్రపతి

Murmu

Murmu

Draupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన కొనసాగుతుంది. నిన్న హైదరాబాద్‌ కు చేరుకున్న రాష్ట్రపతిని సీఎం కేసీఆర్‌ సాదరంగా ఆహ్వానం పలికారు. ఇవాళ ఉదయం దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు రీవ్యూయింగ్‌ ఆఫీసర్‌గా రాష్ట్రపతి ముర్ము పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో రీవ్యూయింగ్‌ ఆఫీసర్‌గా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ధైర్యవంతులు అయిన క్యాడెట్లను కన్న తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలు గుర్తుంచుకోవాలన్నారు.

Read also: Manipur Violence: మణిపూర్ హింస.. బీజేపీ నేతల ఇళ్లకు నిప్పు.. దుండగులపై పోలీసుల కాల్పులు..

అధికారులుగా మీరు బాధ్యతలు తీసుకోబోతున్నారని, రాబోయే రోజుల్లో విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. సిరియా, టర్కీలో జరిగిన భూకంపంలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగా పనిచేసిందని ప్రశంసించారు. కోవిడ్ లోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా అద్భుతంగా పనిచేసిందని అన్నారు. సవాళ్ళను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు. ఏప్రిల్ లో సుఖాయ్ జెట్ లో ప్రయాణించానని, ఇది నాకు చాలా గొప్ప అనుభూతి అని గుర్తు చేసుకున్నారు. సుమారు 30 నిమిషాలు పాటు సుఖోయ్‌లో ప్రయాణించడం గర్వంగా ఉందన్నారు. ఫైటర్ జెట్ ఫైలెట్లులో మహిళలు సైతం అధికంగా ఉండటం సంతోషదాయకంగా ఉందని తెలిపారు. పరేడ్ అనంతరం క్యాడెట్లు అధికారులుగా తమ తొలి సెల్యూట్ ను రాష్ట్రపతికి చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ద్రౌపతి ముర్ము ఢిల్లీకి పయనం కానున్నారు.
Manipur Violence: మణిపూర్ హింస.. బీజేపీ నేతల ఇళ్లకు నిప్పు.. దుండగులపై పోలీసుల కాల్పులు..

Exit mobile version