NTV Telugu Site icon

Praja Palana Application: ప్రజాపాలన అప్లికేషన్ల అమ్మకాలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ వార్నింగ్

Prajapalana Aplication For Saeal

Prajapalana Aplication For Saeal

Praja Palana Application: ప్రజాపాలన అప్లికేషన్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ వార్నింగ్ ఇచ్చారు. 5 గ్యారంటీలకు సంబంధించిన అభయ హస్తం దరఖాస్తులకు ఎలాంటి కొరత లేదన్నారు. అందరికీ ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బయట కొనుగోలు చేయవద్దని సూచించారు. అమ్మిన వారిపై చర్యలు తప్పవు’ అంటూ హెచ్చరించారు. శివారులోని పటాన్చెరులో రూ. 20 చొప్పున ఒక్కో అప్లికేషన్ అమ్మిన మీ సేవా నిర్వాహకుడిపై గురువారం కేసు నమోదు చేశారని అన్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపాలన అప్లికేషన్లు బయట కొనుగోలు చేయవద్దని, అలా తీసుకున్నా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.

Read also: Devil Movie OTT: ‘డెవిల్’ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్..!!

కాగా.. ప్రజా పాలన పథకం అప్లికేషన్ ఫారమ్ ను మీ సేవలో రూ.60 కు విక్రయిస్తున్నారని నిన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రజా పాలన కార్యక్రమం నెల రోజులు పొడగించాలని డిమాండ్ చేశారు. వేలాది మంది దరఖాస్తుల కోసం వస్తే కేవలం ఒక్కో సెంటర్ లో వంద మాత్రమే అందుబాటులో పెడుతున్నారని అన్నారు. మీ సేవలో ప్రజా పాలన పథకం అప్లికేషన్ ఫారమ్ ను రూ.60లకు విక్రయిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్లికేషన్ ఫార్మ్స్ అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెంటర్లలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అధికారులు తగిన ప్రచారం చేయలేదని మండిపడ్డారు. రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల కోసం ఫార్మ్ లో ఎలాంటి వివరాలు లేవని అన్నారు. రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల కోసం వైట్ పేపర్ పై రాసి ఇవ్వాలని అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తుందని అన్నారు. గోషామహల్‌ నియోజక వర్గంలో 24 లోకేషన్‌ లలో ప్లాన్‌ చేశారని, అక్కడ ప్రజాపాలన ఫామ్‌ లు పెడుతున్నారని అన్నారు. ఇలాగే ఇది కొనసాగితే.. ప్రజలకు ఫారమ్ లు పూర్తీగా వివరణ ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రజాపాలన అంటే ముందుగానే ప్రజలకు దీనిపై అవగాహన ఇవ్వాలని తెలిపారు.
Himanta Biswa Sarma : వివాదాల్లో చిక్కుకున్న సీఎం.. ‘బ్రాహ్మణ-శూద్ర’ పోస్ట్‌ను తొలగింపు