NTV Telugu Site icon

Hyderabad: కూలీ పెంచండి.. నేడు హమాలీ కార్మికుల నిరసన..

Hamali Kuli

Hamali Kuli

Hyderabad: నేటి నుండి బేగంబజార్, ఉస్మాన్ గంజ్ లలో హమాలీ కార్మికులు నిరసన తెలుపనున్నారు. నేటి నుంచి హమాలీ కార్మికులు విధులు బహిష్కరించనున్నట్లు ప్రకటించారు. న్యూ ఉస్మాన్ గంజ్ హమాలీ సంఘం ఆధ్వర్యంలో నేటి నుండి ట్రాన్స్పోర్ట్ లో విధులను హమాలీ కార్మికులు బహిష్కరించనున్నారు. గత 2 సంవత్సరాలుగా హమాలీలా కూలీ పెంచకపోవడంతో హమాలీ కార్మికులు ఆందోళనలకు దిగనున్నారు. గత 2 సంవత్సరాలుగా 20 శాతం కూలీ పెంచాలని అగ్రిమెంట్ ఉన్నకూడా ట్రాన్స్ పోర్ట్ ఓనర్ అసోసియేషన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు. కూలీ పెంచకుండా ముందునుంచి ఎలా అయితే కూలీ ఇస్తున్నారో అలానే ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగా కూలీ మాత్రం అంతగానే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read also: TGSRTC: ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన బస్ పాస్ ధరలు

కూలీలను పెంచకుండా పని మొత్తం వున్నవారితోనే చేయిస్తూ కూలీ మాత్రం తక్కువగా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ పోర్ట్ ఓనర్ అసోసియేషన్ కు ఎన్ని మార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ట్రాన్స్ పోర్ట్ ఓనర్ అసోసియేషన్ తమ డిమాండ్లు పరిష్కరించకపోతే.. తమ ఆందోళనలు ఉదృతం చేస్తామని తెలిపారు. బేగంబజార్, ఉస్మాన్ గంజ్ మార్కెట్ పూర్తిగా స్తంభింపచేస్తామని హెచ్చరించారు. దీనిపై ట్రాన్స్ పోర్ట్ ఓనర్ అసోసియేషన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. 20 శాతం కూలీ నేటి నుంచి పెంచాలని తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ ఓనర్ అసోసియేసన్ అధికారులపై ప్రభుత్వం కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరి దీనిపై ట్రాన్స్ పోర్ట్ ఓనర్ అసోసియేషన్ ఎలా స్పందించనుంది అనేది ఉత్కంఠంగా మారింది.
Mallu Bhatti Vikramarka: నేడు వివిధ శాఖలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ…