Ponnam Prabhakar: కేసీఆర్ కు లోపల ట్రీట్మెంట్ జరుగుతుందని రవాణా, బీసీ సంక్షేమం శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకే కేసీఆర్ ను కలవలేదని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావులు లోపల ఉన్నారు.. వారిని అడిగి కేసీఆర్ యోగక్షేమాలు తెలుసుకున్నానని అన్నారు. నియోజకవర్గ కార్యకర్తను కలవడానికి వచ్చానని తెలిపారు. కేసీఆర్ కూడా ఇదే హాస్పిటల్లో ఉన్నారుని, చూద్దామని వెళ్లానని తెలిపారు. కేసీఆర్ కు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది.. అందుకే కేసీఆర్ ను కలవలేదన్నారు. కేటీఆర్, హరీష్ రావు లను కేసీఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నానని తెలిపారు. భవిష్యత్ లో అన్ని గ్యారెంటీ లను కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన 48 గంటల్లో మహిళలకు ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించామన్నారు. 119 నియోజకవర్గాలలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారని అన్నారు.
Read also: Artificial intelligence (AI): హమాస్ యుద్ధంలో ఏఐ టెక్నాలజీని వాడుతున్న ఇజ్రాయిల్..
కాంగ్రెస్ సర్కార్ ప్రజల సమస్యలను వినడానికి ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. కొంత మందిబ బీఆర్ఎస్ మాజీ మంత్రులు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అది ఎప్పుడు.. ఇది ఎప్పుడు ఇస్తారని మమ్మలి అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏళ్ళలో బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచుతామని క్లారిటీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ ల సమస్యలు ఎంటో వినతి పత్రం ఇస్తే పరిశీలిస్తామని తెలిపారు. ఏ వెహికల్స్ కు సంబంధించిన ప్యాసింజర్స్ ఉంటారని తెలిపారు. ఒక స్కీమ్ మొదలు పెట్టినప్పుడు సమస్యలు ఉంటాయన్నారు. నిరంతరం సమీక్ష చేసుకుంటామన్నారు. ఆర్టీసి నీ నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ సర్కార్ కు ఆలోచన లేదన్నారు. అవసరం అయితే రద్దు చేసిన ఆర్టీసి సంఘాల ప్రతినిధులు ఆర్టీసిలో సమస్యలపై పిలిచి మాట్లాడతామన్నారు.
King Nag: నా సామిరంగ… మంచి మెలోడితో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు
