NTV Telugu Site icon

Ponnam Prabhakar: గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: హైదరాబాద్ లోని అబిడ్స్ లో అలియా మోడల్ హైస్కూల్ లో పాఠశాలల పునఃప్రారంభ కార్యక్రమంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవ తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం చేశారు. స్కూల్ రీఓపెన్ కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈరోజు పాఠశాల ప్రారంభం సందర్భంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కోడ్ కి ముందే ప్రభుత్వం తెలంగాణలో 26 వేల స్కూల్ లకి 11 వందల కోట్ల తో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక వసతులు విద్యుత్ ,డ్రింకింగ్ వాటర్ ,టేబుల్స్ ఇలా అన్ని కల్పించామన్నారు.

Read also: Siddipet: ఆసక్తికర సన్నివేశం.. ఒకే కార్యక్రమంలో హరీష్ రావు, రఘునందన్ రావు..

గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైందన్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత విద్య ఉండబోతుందన్నారు. ముఖ్యమంత్రి, నేను మంత్రులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన వాళ్ళమన్నారు. రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులకు విజ్ఞప్తి ప్రతి పాఠశాలలో అనుభవమైన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. పాఠశాలలో అనేక వసతులు కల్పిస్తున్నామన్నారు. విద్యకి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, కంప్యూటర్ ఇలా అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలో ఏం అవసరం ఉన్న తీరుస్తున్నామన్నారు.

Read also: Pawan Kalyan: ప్రమాణ స్వీకారం.. చిరు కాళ్లపై పడి, చంద్రబాబుని హత్తుకున్న పవన్

ఎగ్జామ్ సమయంలో కూడా జిల్లా కలెక్టర్, డీఈవో ఆధ్వర్యంలో ఫలితాలు బాగా రావాలని సమీక్షా సమావేశలు నిర్వహించామన్నారు. డ్రాప్ ఔట్స్ లేకుండా బట్టలు, మధ్యహ్న భోజనం ఇంకా ఏ ఇబ్బందులూ లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిద్దామన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకోవాలి.. విద్యార్థులకు సమాజం గురించి, విద్య గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులను కోరుతున్న ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా చర్యలు తీసుకోవాలి. మెగా డీఎస్సీ ద్వారా ఖాళీలు భర్తీ చేస్తున్నామన్నారు. పిల్లలు ఉన్నత విద్య వైపు మళ్ళించి విధంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలతో పోటీ పడాలన్నారు. విద్య బోధన ద్వారా గురు దేవో భవ, ఆచార్య దేవోభవ అని నిరూపించాలన్నారు.
Stock Market : చరిత్ర సృష్టించే దిశగా స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 600 పాయింట్ల లాభం