Site icon NTV Telugu

Ponnam Prabhakar: లారీ డ్రైవర్ల సమ్మె విరమించుకోవాలి.. పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి..

Ponnama Prabhakar

Ponnama Prabhakar

Ponnam Prabhakar: లారీ డ్రైవర్ల సమ్మె విరమించుకోవాలని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. డ్రైవర్ల సమస్య కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిధి అని, సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలిగించద్దని కోరారు. ఇది సరైంది కాదని కొత్త చట్టం రాష్ట్ర పరిధిలోనిది కాదని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని పొన్నం ప్రభాకర్ తెలిపారు. లారీ డ్రైవర్లు సమ్మెపై పునరలోచించాలని విజ్ఞప్తి చేశారు. లారీ డ్రైవర్లు సమ్మె చేయవద్దని… సమ్మె లోకి వెళ్తే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని వెంటనే సమ్మెపై పునరలోచించాలని కోరారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేయడం లేదని ఇది అందరికి కాకుండా ప్రమాదం జరిగిన తరువాత హిట్ అండ్ రన్ కి పాల్పడే వారికి మాత్రమే వర్తిస్తుందని రవాణా శాఖ అధికారులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ తో పలు సంఘాలు డ్రైవర్స్ యూనియన్స్ కి అవగహన కల్పిస్తున్నాయి.

Read also: Raja Singh: మరోసారి బెదిరింపు కాల్స్.. ఫోన్‌ నెంబర్లతో సహా బయటపెట్టిన రాజాసింగ్..

సమ్మెలోకి కొంతమంది డ్రైవర్ సంఘాలు మాత్రమే వెళ్తున్నాయని, దానిని లారీ సంఘాల వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నాయన్నారు. భవిష్యత్ లో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం లారీ ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్లను పిలిచి మాట్లాడతామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టంలోని 106(2) హిట్ అండ్ రన్ కి సంబంధించిన సెక్షన్ ని ఇప్పట్లో అమలు చేయమని ఇప్పటికే కేంద్ర హోంశాఖ సెక్రెటరీలు ప్రకటించారు. ఒకవేళ భవిష్యత్ లో అమలు చేయాల్సి వస్తే డ్రైవర్స్ & లారీ ఓనర్స్ ని పిలిచి మాట్లాడతామని ఆ తరువాతనే అమలు చేస్తామని కేంద్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ భళ్ళ ఇప్పటికే హామీ ఇచ్చి ఉన్నారు. కాని కొన్ని గుర్తింపు లేని సంఘాలు రేపటి నుండి లారీల సమ్మె చేయాలని భావిస్తున్నారు.. సమ్మెని గుర్తింపు పొందిన సంఘాలతో పాటు మెజారిటీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

Exit mobile version