తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. మొన్న జరిగిన అఖిల పక్ష సమావేశానికి తనకు ఇష్టమైన వాళ్ళనే పిలిచారని.. కెసిఆర్ దళిత ద్రోహి అని నిప్పులు చెరిగారు. రోహిత్ హత్య జరిగితే కనీసం సానుభూతి ప్రకటించలేని దౌర్భాగ్య స్థితి లో టీఆర్‌ఎస్ పార్టీ ఉందని మండిపడ్డారు. మూడు ఎకరాలు మానేసి… నియోజకవర్గంలో 100 మందికి 10 లక్షలు ఇస్తానని కొత్త నాటకం మొదలు పెట్టాడని.. ప్రకటనకే పాలాభిషేకం చేస్తున్నారని ఎద్దేవా చేశారు పొన్నాల. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నారు… కనీసం కేబినెట్ లో మంత్రి పదవి కూడా లేదని మండిపడ్డారు. ఈ నాటకాలు కట్టిపెట్టాలని కెసిఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ నాటాకాలు ఆడుతున్నాడని చురకలు అంటించారు.