NTV Telugu Site icon

Ponnala Lakshmaiah: కేసీఆర్ సర్కార్ మాటలతో పబ్బం గడుపుతోంది

Ponnala Lakshmaiah On Ktr

Ponnala Lakshmaiah On Ktr

Ponnala Lakshmaiah Fires On KCR And KTR: కేసీఆర్ సర్కార్ మాటలతో పబ్బం గడుపుతోందని, మంత్రి కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. 71 లక్షలు ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ అన్నారని.. ఇప్పుడు వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కొత్త కంపెనీలు ఎన్ని వచ్చాయి? అందులో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? అనే లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. MAJOR IT సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఎక్కువ ఉద్యోగాలు ఎక్స్‌పెన్షన్ వల్ల వచ్చినవేనని అన్నారు. ఐటీ అంటే ఇవాంకా ట్రంప్ అని ఐటీ మంత్రి కామెడీ చేశారని చెప్పారు. కంపెనీ వచ్చిందని డబ్బా కొట్టుకోవడానికి.. 4 రోజుల పాటు 4 ప్రోగ్రాంలు చేస్తే సరిపోదని సూచించారు. నిజాం సాగర్ కళకళలాడుతోందని పబ్లిక్ మీటింగ్‌లో చెప్పడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. అసలు కాళేశ్వరం నుండి వచ్చే నీటి లింక్ ఇంకా పూర్తి కాలేదని, అప్పుడే నిజాం సాగర్‌కి నీళ్లు ఎలా వచ్చాయో చెప్పాలని అడిగారు. రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయని.. వాటిని నీటితో నింపే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు.

Russia: ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నడిపిస్తోంది అదృశ్య హస్తం కాదు.. అమెరికానే..

అంతకుముందు.. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణను అవినీతి, అప్పుల రాష్ట్రంగా మార్చారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. కాంగ్రెస్‌ హయాంలోనే జలాశయాలను నిర్మించారని, నేటికీ కాల్వలు తవ్విన పాపాన పోలేదని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారని.. ఇప్పుడు ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట రుణాల మాఫీ కనిపించడం లేదన్న ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్షల కోట్లు దండుకున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ భాష బాగుంటుంది కానీ, పని మాత్రం బొంద పెట్టినట్లుగా ఉంటుందని విమర్శించారు. తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ అవినీతి సంపాదనను బయటపెట్టి, ఆయన్ను చంచల్‌గూడ జైలుకు పంపించడం ఖాయమని అన్నారు. కేసీఆర్ చెప్తున్న రైతులకు 24 గంటల విద్యుత్తు రావడం లేదని విరుచుకుపడ్డారు.

Turkey Earthquake: టర్కీ భూకంప నష్టాన్ని అంచనా వేసిన ఐక్యరాజ్యసమితి.. ఎంతంటే?