NTV Telugu Site icon

Ponguleti: డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం హస్తం గుర్తుపై వేయండి.. పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

Ponguleti

Ponguleti

Ponguleti: అక్రమంగా సంపాదించిన డబ్బులు ఎన్ని ఇచ్చినా మీరు తీసుకోండి అవి మనవే అని ఓటు మాత్రం హస్తం గుర్తుపై వేయండని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు మునిగే పల్లి గ్రామంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో భాగంగా చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే గ్రామ పంచాయతీల్లో చేసింది ఏమీ లేదని అన్నారు. ఎన్ర్జీఎస్ 5 లక్షల రూపాయల రోడ్డు తప్ప పిడికెడు మట్టి పోయలేదని మండిపడ్డారు. రేపు వచ్చే ఎలక్షన్లో కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో మీ ముందుకు వస్తాడని కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాయమాటలు దొంగ మాటలు మీకు చెప్తాడు అవి ఏవి మీరు నమ్మొద్దని అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులు ఎన్ని ఇచ్చినా మీరు తీసుకోండి అవి మనవి అన్నారు పొంగులేటి. కానీ.. ఓటు మాత్రం మీ మనసు పూర్తిగా హస్తం గుర్తుపై వేయాలని ప్రజలను కోరారు. తెలంగాణ ప్రభుత్వం వల్ల కలవకుంట్ల కుటుంబానికి ఉపయోగపడింది తప్ప ప్రజలకు ఏమి న్యాయం జరగలేదన్నారు. పాలేరులో నన్ను ఖమ్మంలో తుమ్మలని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ పేరుపేరునా వేడుకుంటున్నానని అన్నారు.

నిన్న ఖమ్మం జిల్లా 32 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే.. బీఆర్ఎస్ అభ్యర్థి రెండు పర్యాయాలు శాసన సభ్యుడిగా పని చేసి ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఎన్నికలు రాగానే ఆయన గురిగింజను అంటున్నారని మండిపడ్డారు. ఆయన ఏ సామాజిక వర్గం దగ్గరకు వెళ్తే ఆ సామాజిక వర్గం వాడిగా చెప్పుకునే మనస్థత్వం ఆయనదన్నారు. అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఖమ్మంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. తుమ్మల వారిపై వీరిపై కేసులు పెట్టమని ఏ రోజు అధికారులను ఆదేశించలేదని గుర్తు చేశారు. అరాచక పాలన నడిపే వ్యక్తి కావాలా? అభివృద్ధి చేసే వ్యక్తి కావాలా? అని ప్రశ్నించారు. ఇదే జిల్లాకు వచ్చి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా అవాక్కులు పేలారని తెలిపారు. అరాచకంగా సంపాదించి డబ్బుతో నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్న అంటున్నారు, అరాచక అనే నైతిక హక్కు నీకు ఉందా కేసిఆర్? అని ప్రశ్నించారు. అయినా మీ లాగా.. మా కుటుంబంలో ఎవరు రాజకీయంగా డబ్బు సంపాదించలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
AI Creative Images : AI రూపొందించిన పాస్తా నగర చిత్రాలను చూశారా? వావ్ అద్భుతమే..