Site icon NTV Telugu

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అవమానం

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు అవమానం జరిగింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసు హెడ్ క్వాటర్స్ దగ్గర పోలీసులు నిలిపివేశారు. వాహనం దిగి ఆర్ అండ్ బి అతిథిగృహం వరకు నడిచివెళ్లిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి… పోలీసులు తీరుకు నడిచివెళ్లి నిరసన తెలిపారు. అటు అధికార పార్టీ ఎమ్మెల్యేపై పోలీసుల వైఖరిని తప్పుపడుతున్నారు నేతలు. ఇది ఇలా ఉండగా.. సీఎం రాక సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కరపత్రాలు కలకలం రేపాయి.

read also : తెలకపల్లి రవి : తెలంగాణ ఉద్యమంలో ప్రొ.జయశంకర్‌ ప్రత్యేక ముద్ర

సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హాట్ టాపిక్ గా కరపత్రాలు మారాయి. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కబ్జా కోరు అంటూ ఘటగా లేఖలో పేర్కొన్న ఆగంతకుడు.. న్యూస్ పేపర్ లో పెట్టి వరంగల్ తూర్పు లో గుర్తు తెలియని వ్యక్తులు పంపిణీ చేశారు. నేడు సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ ను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తూ కరపత్రాలు విడుదల అయ్యాయి. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీ బి ఫారం లు 50 లక్షలకు అమ్ముకున్నడాని, గతంలో ములుగు జిల్లాలో ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల సమయంలోను ఇలాగే డబ్బులు వాసులు చేసాడని లేఖలో పేర్కొన్నారు గుర్తు తెలియని వ్యక్తులు.

Exit mobile version