రాజేంద్రనగర్ శివరాంపల్లి లో విషాదం చోటు చేసుకుంది. నేషనల్ పోలీస్ అకాడమీలో పని చేస్తున్న కానిస్టేబుల్ వాసు ఆత్మహత్య చేసుకున్నాడు. శివరాంపల్లి రెడ్డి బస్తీలో నివాసం వుంటున్న వాసు తన గది లో ఫ్యాన్ కు ఊరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి తన గది లోకి వెళ్లి ఆత్మహత్య కు చేసుకున్నాడువాసు. అయితే ఉదయం గది నుండి ఎంతకీ బయటకు రాకపోవడంతో కంగారు పడ్డ భార్య… గట్టిగా కేకలు వేస్తూ బోరున విలపిస్తుండగా వాసు ఇంటికి చేరుకున్న కాలనీ వాసుల సహాయం తో గది తలుపులు బద్దలు కొట్టారు. అక్కడ తాడుకు వేలాడుతూ కనిపించిన భర్తను చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది భార్య.
ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం కు చెందిన నీలిమ తో గత 15 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు వాసు. వివాహం జరిగిన రెండు నెలల తరువాత ఇద్దరి మద్య మనస్పర్ధలు.. తరచూ ఇద్దరి మధ్య ఘర్షణలు జరుగుతుండేవి. మద్యం సేవించి నీలీమ పై చేయి చేసుకున్న వాసు పై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది నీలిమ. అర్ధరాత్రి తప్ప తాగి ఇంటికి చేరుకున్న వాసు… ఎందుకు తాగారు అని ప్రశ్నించిన నీలిమతో గొడవకు దిగ్గాడు. ఇద్దరి మద్య మాటల యుద్ధం నడవడంతో క్షణికావేశంతో గదిలొకి వెళ్లిన వాసు ఉరి వేసుకున్నాడు. స్థానికుల సమాచారం తో ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు… మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.