NTV Telugu Site icon

Telangana: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు.. ఎంత డబ్బు సీజ్‌ చేశారంటే..

Police Checks Across Telangana State

Police Checks Across Telangana State

Police checks across Telangana state: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఎలక్షన్ల కోడ్ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు రైల్వే స్టేషన్లను, ట్రైన్లను వదలడం లేదు. విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ చంద్రమోహన్ సిబ్బందితో కలిసి రైల్వేస్టేషన్ తో పాటు ట్రైన్స్ లో ఎక్కి కొంత దూరం ప్రయాణించి మరి తనిఖీలు చేశారు. ఇక మరోవైపు హైదరాబాద్‌లో కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.3.35 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి కారు, నగదు లెక్కింపు యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో వాహనాలను తనిఖీ చేశారు.అయితే పోలీసులు కారులో భారీగా డబ్బుతో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3.35 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా డబ్బా రవాణా చేస్తున్న వారిని సీహెచ్‌గా గుర్తించారు. చిత్తూరు జిల్లాకు చెందిన హనుమంత రెడ్డి, బి. ప్రభాకర్, ఎం. శ్రీరాములు రెడ్డి, ఎం.ఉదయ్‌కుమార్ రెడ్డి. ప్రధాన సూత్రధారి హనుమంత రెడ్డి ప్రైవేట్ ఉద్యోగం మానేసి మిగతా ముగ్గురితో కలిసి హవాలా దందా ప్రారంభించినట్లు సమాచారం.

దేశ, విదేశాల నుంచి వచ్చిన హవాలా ఆర్డర్ ను ఆ ముగ్గురు వ్యక్తులతో గమ్యస్థానానికి చేరవేస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం బేగంబజార్, నాంపల్లి, గోషామహల్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో సేకరించిన రూ.3.35 కోట్ల నగదును తమ కార్యాలయానికి చేరవేసే క్రమంలో పోలీసులకు చిక్కారు. అయితే ఈ డబ్బు ఎవరి నుంచి వసూలు చేశారు? మీరు ఎవరికి పంపిణీ చేస్తున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు పావులు కదుపుతున్నారా? అనే కోణంలో కూడా విచారణ జరిపి సికింద్రాబాద్‌లో తనిఖీల్లో రూ.50 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు, రూ.12.15 లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో రూ.9.4 లక్షలు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రూ.6.50 లక్షలు, నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద రూ.5.60 లక్షలు, పెద్దపల్లి జిల్లాలో రూ.3 లక్షలు, వనపర్తి జిల్లా కొత్తకోటలో రూ.2.35 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరియు మహబూబ్ నగర్ జిల్లాలో రూ.2 లక్షలు. చేసినా సరైన పత్రాలు చూపించి నగదు తీసుకెళ్లాలని సూచించారు.
Abhishek Agarwal: పాన్ ఇండియా ప్రొడ్యూసర్ ఆఫీసలో ఐటీ సోదాలు…