గోశామహాల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. హోంమంత్రి మహమ్మద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్, మాజీ ఉన్నాతాధికారులు హాజరయ్యారు. హోంమంత్రి, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. దేశ భద్రతలో పోలీసుల సేవలు చిరస్మరణీయ నీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో 377మంది పోలీసులు అమరులయ్యారన్నారు. కరోనా సమయంలో 62 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, ఇందులో10మంది హోం గార్డులు ఉన్నట్టు తెలిపారు.
కరోనా సమయంలో పోలీసులకు ప్రభుత్వం అండగా ఉందన్నారు మహమూద్ అలీ. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాల సంఖ్యను తగ్గేలా చేస్తామన్నారు. నూతన పోలీస్ స్టేషన్‌లతో పాటు మహిళల భద్రతకు భరోసా సెంటర్లను ఏర్పాటు చేసి వారికి అండగా ఉండనున్నట్టు పేర్కొన్నారు. గడిచిన ఏడేళ్లలో ఎలాంటి మతఘర్షణలు జరగలేదన్నారు. బోనాలు, రంజాన్ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరిపామన్నారు. అనంతరం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమర వీరులకు రాష్ట్రప్రభుత్వం తరపున శ్రద్ధాంజలి ఘటించారు.