NTV Telugu Site icon

PM Modi Visit to Telangana: రేపు రాష్ట్రానికి ప్రధాని మోడీ.. మల్కాజ్‌గిరిలో రోడ్‌షో

Pm Modi

Pm Modi

PM Modi visit to Telangana: త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి తెలంగాణ రాష్ట్రంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రేపు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండోసారి రాష్ట్రానికి రావడం తెలంగాణపై బీజేపీ దృష్టి పెట్టిందని అర్థమవుతుంది. ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల బరిలోకి దిగుతాయన్న సంకేతాల నేపథ్యంలో ప్రధాని మోcw ఈ నెల 15న మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి స్థానంపై దృష్టి సారించింది. సిట్టింగ్ సికింద్రాబాద్ సీటుతోపాటు మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్ స్థానాలపై దృష్టి సారించిన కమలదళం.. జాతీయ నేతలను ప్రచారంలో దింపుతోంది. రెండు రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా నగరంలో పర్యటించారు. పదిరోజుల్లోనే రెండోసారి ప్రధాని రాష్ట్రానికి రావడం గమనార్హం. ఇటీవల నగర శివార్లలోని పటాన్చెరులో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే.

Read also: Ravikula Raghurama: రవికుల రఘురామ ట్రైలర్ రిలీజ్ చేసిన విజయ్ సేతుపతి..

ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నగర ఓటర్లను ఆకట్టుకునేందుకు రోడ్ షోలు నిర్వహిస్తోంది. మల్కాజిగిరిలో దాదాపు 5 కి.మీ మేర ప్రధాని రోడ్ షో ప్లాన్ చేశారు. ఇక నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈ నెల 15న మల్కాజిగిరిలో జరిగే సభలో మోడీ పాల్గొంటారు. దీంతో మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ రోడ్డు వరకు 5 కి.మీ. పారా గ్లైడర్‌లు, రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్‌లు, రిమోట్‌ కంట్రోల్‌ మైక్రో లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపరాదని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పలు ఐపీసీ సెక్షన్‌ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా.. మోడీ పర్యటనలు బీజేపీకి ఏమైనా లాభిస్తాయా? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టిన బీజేపీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
Viral: ఎలావస్తాయో ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ జామ్‌ లో ఆ మహిళ చేసిన పనిచూస్తే వావ్ అనాల్సిందే..!