Pilot Rohith Reddy: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతిరుద్ర మహా యాగంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గత మూడు రోజులుగా ఎమ్మెల్యే దంపతులు యాగం నిర్వహిస్తున్నారు. రెండు రోజులు బాగానే నిర్వహించిన ప్రధాన యాగశాలలో ఇవాల మూడోరోజు అగ్నిప్రమాదం జరిగింది. యాగం చేస్తున్న మండపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో మండపంలోని వారందరూ భయాందోళకు గురయ్యారు. మండపంలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. ప్రధాన యాగం దగ్గర నిప్పురవ్వలు ఎగిరి పడడంతో టెంట్ కు మంటలు వ్యాపించాయి. మండపం మొత్తం అగ్ని ఆహుతి అయ్యింది. ఆప్రాంతం అంతా పొగలు కమ్ముకున్నాయి. దీంతో అక్కడే వున్న ప్రజలు తీవ్ర భాయాందోళనకు గురయ్యారు. పైర్ సిబ్బంది సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటా హుటిన మండపం దగ్గరకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికి ఎటువంటి హాని జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఎలాంటి హనీ జరగలేదని తెలిపారు. పార్టీశ్రేణులు, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తనకు తన కుటుంబానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. మూడురోజులుగా సాగుతున్న యాగంలో ఇవాల అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమన్నారు.
Read also: Tspsc Paper Leak: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసు.. కరీంనగర్‌కు చెందిన తండ్రి, కుమార్తె అరెస్ట్
ఇక జనవరి 2023లో కూడా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పని నిమిత్తం బెంగళూరు వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళ్లారు. మంగుళూరు సమీపంలో ముడూరు- నల్లూరు క్రాస్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని అధిగమించి ఒక్కసారిగా చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. అయితే.. కారులో ప్రయాణిస్తున్న పైలట్ రోహిత్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఆయన పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావటంతో .. పైలెట్ రోహిత రెడ్డి కి ప్రమాదం తప్పింది.
Pet Dog Bite: మన కుక్కే కదా అనుకుంది.. కరవడంతో కాటికి వెళ్లింది