NTV Telugu Site icon

Medaram Rush: మేడారంలో భక్తుల సందడి.. మినీజాతరకు ముందే రద్దీ

Medaram

Medaram

మేడారం జాతర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గిరిజన మహా జాతర మేడారంకి కోట్లాదిమంది భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మినీజాతర జరగనుంది. అయితే ఇప్పటినుంచే మేడారం కి పోటెత్తారు భక్తులు. మినీ మేడారం జాతరకు వారం రోజుల ముందుగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తజనం. ఆదివారం సెలవు దినం కావడంతో పదివేల మంది పైగా వనదేవత లను దర్శించుకున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ దేవతలను ఆదివారం సెలవు దినం కావడంతో పదివేలమందికి పైగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు.

మేడారం మినీ జాతర ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుంచి నాల్గవ తారీఖు వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల ముందుగానే భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న భక్తులు జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరించి తలనీలాల సమర్పించుకొని అనంతరం వనదేవతల గద్దెలకు చేరుకొని పసుపు ,కుంకుమ ,వడియాల బియ్యంతో మొక్కులు చెల్లిస్తారు.

సమ్మక్క సారలమ్మ దేవతలకు చీర, సారేలు పెట్టీ,నిలువెత్తు బంగారాన్ని సమర్పించి కోళ్లు మేకలు అమ్మవార్లకు నైవేద్యంగా బలిస్తారు తమ కోరిన కోరికలు నెరవేరాలని వేడుకొంటారు. ఈరోజు దర్చించుకున్న భక్తుల తో మేడారం గ్రామం సందడిగా మారింది. ఫిబ్రవరి 1 నుండి 4వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు కోటి మంది పైగా భక్తులు వచ్చే అవకాశం వునందున భక్తుల సౌకర్యం కొరకు త్రాగునీరు, పారిశుద్ధం,టాయిలెట్స్ ,కరెంట్ మొదలయిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

Read Also: Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. కారణం అదే!