ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు అందజేశారు. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, కేసీఆర్ వయస్సు, ఆరోగ్య రీత్యా ఆయనకు పోలీస్ స్టేషన్‌కు రావాలనే నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావచ్చు లేదా హైదరాబాద్ పరిధిలో తనకు అనుకూలమైన మరో ప్రదేశాన్ని సూచించవచ్చని అధికారులు వెసులుబాటు కల్పించారు. కేసీఆర్ సూచించిన ప్రదేశానికే అధికారులు వచ్చి విచారణ జరుపుతారని, ఆ ప్రదేశం ఏదనేది ముందే తెలియజేయాలని సిట్ స్పష్టం చేసింది.
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డికి బిగ్ రిలీఫ్..
సిట్ నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మరికాసేపట్లో ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లనున్నారు. కేసీఆర్‌తో కలిసి వారు ఈ నోటీసుల పై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ముఖ్యంగా రేపటి విచారణకు హాజరుకావాలా? లేక న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు అధికారులను మరికొంత సమయం కోరాలా? అనే అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది.
Yadadri Scam: యాదాద్రిలో డాలర్స్ మాయం.. ఆడిట్‌లో బయటపడ్డ అసలు నిజం.!
