FASTag-KYC: ఫాస్టాగ్ కేవైసీ అప్‌డేట్ చేసుకునేందుకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. నిజానికి FASTAG-KYC అప్‌డేట్ గడువు నిన్నటితో (గురువారం)తో ముగుస్తుంది. కానీ ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. FASTAG అనేది జాతీయ రహదారులు,ఇతర రహదారులపై వాహనాల నుండి టోల్ పన్ను వసూలు చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ వ్యవస్థ. ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ సిస్టమ్ తీసుకురావడానికి ఫాస్ట్-కేవైసీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే..ఒక్కో వాహనానికి ఒక కేవైసీ ఉండేలా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక వాహనం, ఒక ఫాస్టాగ్ పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. కాగా.. NHAI వాహనదారులు KYC ప్రక్రియను పూర్తి చేయడానికి జనవరి 31 వరకు గడువు విధించింది. ఇక KYC ప్రక్రియ పూర్తి కానప్పుడు ఫిబ్రవరి 29 వరకు గడువును పొడిగించింది.
Read also: Fake Currency in Medaram: మేడారం హుండీ లెక్కింపు.. బయటపడ్డ నకిలీ కరెన్సీనోట్లు
కాగా.. ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. Paytm FASTag వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మరోసారి గడువును పొడిగించింది. ఇటీవల, NHAI, నో-యువర్-కస్టమర్‌ని అప్‌డేట్ చేయడానికి గడువును మార్చి 31, 2024 వరకు పొడిగించింది. ఒకే ఫాస్టాగ్‌ని వేర్వేరు వాహనాలకు వినియోగిస్తున్నట్లు జాతీయ రహదారుల అథారిటీ దృష్టికి వచ్చింది. KYC పూర్తి చేయకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు ఫాస్టాగ్ KYCని తప్పనిసరి చేసినట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. మార్చి 31లోగా KYCని అప్‌డేట్ చేయాలని లేదా FASTAG ఖాతా డీయాక్టివేట్ చేయబడుతుందని పేర్కొంది. KYCని నవీకరించడానికి, వాహనదారులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ మొదలైన వారి గుర్తింపు పత్రాలను అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది.
KYCని అప్‌డేట్ ఇలా:
* మీ FASTAG KYC స్థితిని తెలుసుకోవడానికి మీరు FASTAG అధికారిక వెబ్‌సైట్ https://fastag.ihmcl.comని సందర్శించాలి.
* మీరు మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా OTPతో లాగిన్ అవ్వాలి.
* ఆ తర్వాత డ్యాష్‌బోర్డ్‌లోకి వెళ్లి My Profile ఆప్షన్‌ను ఎంచుకోండి.
* మీ KYC స్థితి వివరాలు అక్కడ కనిపిస్తాయి.
* KYC పూర్తి కాకపోతే, అభ్యర్థించిన వివరాలను సమర్పించి, ప్రాసెస్ చేయాలి.
* ఇది మీ స్థితిని చూపుతుంది. మీ KYC ప్రక్రియ పూర్తవుతుంది.
* అదేవిధంగా, మీరు ఫాస్ట్‌ట్యాగ్‌ని జారీ చేసిన బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి వివరాలను సమర్పించి, KYCని పూర్తి చేయవచ్చు.