NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్ కాన్వాయ్ లో మరో 6 వాహనాలు.. అవేంటంటే..?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల కోసం బాగా కష్టపడుతున్నారు. జనసేన తరపున ఆయన ప్రచారం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఒకానొక సమయంలో కొంచెం మెతకగా కనిపించిన పవన్ ఈసారి రాజకీయ రంగును గట్టిగానే పులుముకున్నాడని తెలుస్తోంది. మాటకు మాట.. కౌంటర్ కు రీ కౌంటర్ గట్టిగానే వేస్తున్నారు. ట్విట్టర్ లోను తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు. ఇక కొంతమంది ఈసారి పవన్ కు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటుండగా.. ఇంకొందరు అంతా ఎన్నికల వరకే.. ఓట్లు మాత్రం రావు అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఇటీవలే పవన్ ప్రచార వాహనం వారాహి గురించి పెద్ద వివాదమే నడిచింది.

వాహనానికి అమ్మవారి పేరు పెట్టి ప్రచారం చేయడం తప్పా అని పవన్ అంటుంటే.. అమ్మవారి పేరు పెట్టుకొని తప్పులు చేయడం కన్నా వరాహం అని పెట్టుకొని ఇష్టమొచ్చినట్లు ఉరేగు అని వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ఇక వీటన్నింటి గురించి వదిలేస్తే తాజాగా పవన్ కాన్వాయ్ లో మరో 6 వాహనాలు వచ్చి చేరాయి. నేడు పవన్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తనకు సంబంధించిన ఆరు వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించారు. ఇక ఆ వాహనాలు ఏంటంటే.. రెండు స్కార్పియో వాహనాలు, ఒక టయోటా వెల్ఫేయిర్, ఒక జీప్, ఒక బెంజ్, మరో చిన్న తరహా వాహనాలకు ఆయన రిజిస్ట్రేషన్ చేయించారు. ఆర్టీఏ అధికారితో కొద్దిసేపు పవన్ ముచ్చటించి ఆయనతో ఫోటో దిగి సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments