Site icon NTV Telugu

Travelers to Goa: గోవా వెళ్లాల్సిన ప్రయాణికులు రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందు..?

Goa Tour Bus Bronlums

Goa Tour Bus Bronlums

Travelers to Goa: గోవా వెళ్లాల్సిన ప్రయాణిలకు ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు చుక్కులు చూపించారు. గోవాకు వెళ్లాల్సిన ప్రయాణికులకు పోలీస్ స్టేషన్ ముందు రాత్రంతా కూర్చొబెట్టారు. ఒకే దగ్గరకు రావాలని ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికులందరిని పరుగులు పెట్టించాడు. ఎల్ బి నగర్ నుంచి పికప్ చేసుకోవాల్సి ఉండగా అందరిని మియాపూర్ రావాలని పురమాయించాడు. బస్సులో సౌకర్యాలు బాగా లేవని అడిగినందుకు బస్సు డ్రైవర్ ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం అశోక్ నగర్ వద్ద రోడ్డుపై బస్సు ఆపేసిన డ్రైవర్ అక్కడి నుంచి ప్రయాణికులకు వదిలి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రయాణికులు 100 కు డయల్ చేయడంతో నిమిషాల్లో స్పందించిన పోలీసులు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ కు బస్సును తరలించారు. దీంతో షాక్ తిన్న బస్సు డ్రైవర్ పోలీస్ స్టేషన్ వద్ద బస్సును విడిచిపెట్టి పరారయ్యాడు. రాత్రంతా పిల్లాపాపలతో ప్రయాణికులు రోడ్డుపైనే గడిపారు.

Read also: KKR vs SRH Qualifier 1: కోల్‌కతాతో మ్యాచ్.. సన్‌రైజర్స్‌కు శుభవార్త!

ప్రయాణికులు మాట్లాడుతూ.. ఇండియన్ కొస్ట్ గార్డు అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూ మిస్ అయ్యందంటూ చరణ్ వర్మ అనే ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు యజమాని సునిల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్సీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బస్సు ఓనర్ సునీల్ కు కాల్ చేసిన స్పందించడం లేదన్నారు. దీంతో ఉరుకులు పరుగులతో మియాపూర్ కు వచ్చామని ప్రయాణికులు తెలిపారు. అయితే.. రాత్రి 9 గంటలకు బయలు దేరాల్సిన బస్సు.. 9.45 గంటకు బయలు దేరలేందని వాపోయారు. బస్సు లోపలికి వెళ్లి చూడగా లోపల స్విచ్‌ బోర్డు హ్యాంగింగ్‌ లో ఉన్నాయని, ఏసీ పనిచేయట్లేదని, లైట్లు లేవన్నారు. ఈ విషయమైన డ్రైవర్ కు ప్రశ్నించగా.. అవి అట్లే ఉంటది.. నన్ను అడిగి బుక్‌ చేశారా? అంటూ డ్రైవర్‌ ర్యాష్‌ గా సమాధానం చెప్పాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్‌ నగర్‌ పిస్తా హౌస్‌ వద్ద బస్సు ఆపేసి కిందికి దిగిన డ్రైవర్‌ సిగర్‌ తాగుతూ ఎంతకీ బస్సు నడపకపోవడంతో ప్రయాణికులు ప్రశ్నించగా మీరంతా ప్రశ్నించకుండా.. లొల్లి చేయకుంటే బస్సు నడుపుతామంటూ బెదిరించి, వెళ్లిపోతుండటంతో ఓనర్‌ కు కాల్‌ చేశారు ప్రయాణికులు.

Read also: Telangana DGP Fake DP: తెలంగాణ డీజీపీ రవి గుప్తా వాట్సప్ డీపీతో సైబర్‌ ఫ్రాడ్‌..

అయితే ప్రయాణికుల మాట వినకుండా డ్రైవర్ కు కాల్ చేసిన ఓనర్ సునీల్ తీస్కపోతే తీస్కపో లేకుంటే వదిలేయ్‌ అనడంతో డ్రైవర్‌, ఓనర్ చేస్టలకు విసుగు చెందిన ప్రయాణికులందరూ 100కి కాల్‌ చేసి పోలీస్టేషన్‌ కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీస్టేషన్‌ వద్దకు రాగానే డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఓనర్‌ కు కాల్‌ చేస్తే.. 10 నిమిషాల్లో వస్తానంటూ కాల్ కట్ చేస్తున్నారని వాపోయారు. రాత్రి నుంచి ట్రావెల్ బస్సు ఓనర్ సునీల్ నిర్లక్ష్యం వల్లే గోవా వెళ్లాల్సిన మేమందరం ఇలా పోలీస్టేషన్ ముందు ఉండాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓనర్‌ సునీల్ కఠిన చర్యలు తీసుకోవాలసి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సునీల్ కు అదుపులో తీసుకునేందుకు చర్యలు చేప్టటారు.
Harish Rao: నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు చెల్లించండి.. హరీష్‌ రావు ట్వీట్ వైరల్

Exit mobile version