Site icon NTV Telugu

Rajyasabha: రెండు రాజ్యసభ స్థానాలు టీఆర్ఎస్ కైవసం

Rajya Sabha Pti Photo 2

Rajya Sabha Pti Photo 2

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ. ఇటీవల మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. బండ ప్రకాష్ రాజీనామాతో ఏర్పడిని ఖాళీతో పాటు డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్మీకాంతరావు పదవీ కాలం ముగియడంతో రెండు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ మూడు రాజ్యసభ స్థానాలకు గాయత్రి రవి, హెటిరో అధినేత పార్థసారధి రెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు పేర్లను ప్రకటించారు.

అయితే బండ ప్రకాష్ రాజీనామా చేసిన స్థానంలో గాయత్రి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే మిగిలిన రెండు స్థానాలను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. రాజ్యసభ ఎంపీలుగా పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ధ్రువీకరణ పత్రాలను అందిచారు. దీంతో పెద్దల సభలో టీఆర్ఎస్ బలం పెరగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రస్తుతం ఏడుగురు సభ్యులు ఉన్నారు.

Exit mobile version