Kaushik Reddy: బుధవారం 11 గంటలకు జూబ్లి హిల్స్ టిటిడి టెంపెల్ దగ్గరకు మంత్రి పొన్నం ప్రభాకర్ రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. నా బ్లాక్ బుక్ లో మీ పేర్లు రాస్తున్న…మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బ్లాక్ డెస్ ఉంటాయన్నారు. 34 నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. మాకు తెలియకుండా నియోజకవర్గాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించాలని కోరుతున్న అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తాడు అని కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఆపుతున్నారని తెలిపారు. 368 కళ్యాణ లక్ష్మి చెక్కులు హుజూరాబాద్ నియోజకవర్గం కు వచ్చాయి …అవి ఇవ్వడం లేదు…ఈ నెల 27 న చెక్కుల తేది అయిపోతుందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తె అభ్యంతరం లేదు… ఎందుకు పొన్నం ప్రభాకర్ భయపడుతున్నారు ? అని ప్రశ్నించారు.
Read also: Legal Notices: మంత్రి పొన్నంపై ఆరోపణలు.. పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు..
కళ్యాణ లక్ష్మి లో తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది… అది అడుగుతమని భయపడుతున్నారా ? అని ప్రశ్నించారు. బుధవారం 11 గంటలకు జూబ్లి హిల్స్ టిటిడి టెంపెల్ దగ్గరకు మంత్రి పొన్నం ప్రభాకర్ రావాలి అని సవాల్ విసిరారు. ఫ్లై యాష్ స్కాం లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారని ఆరోపించారు. వేంకటేశ్వర స్వామి ముందు నేను డబ్బులు తీసుకోలేదని పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేయాలి..పొన్నం ప్రభాకర్ డబ్బులు తీసుకున్నారని నేను ప్రమాణం చేస్తా అన్నారు. బుధవారం ఫ్లై యాష్ స్కాం లో పొన్నం ప్రభాకర్ మరిన్ని వివరాలు చెబుతా అన్నారు. BRS నుంచి నలుగురు దొంగలు పోయారన్నారు. ఒకరిద్దరు ఎంఎల్ఏ లు పోతే BRS కి ఏం కాదు… ఫరక్ పడదన్నారు. కేసీఆర్ ను మోసం చేస్తున్న ఎంఎల్ఏ ను ఎవరిని వదలి పెట్టం…మీ లొసుగులు తెలుసన్నారు. మళ్ళీ పార్టీలోకి రానిచ్చేది లేదన్నారు. ఎంఎల్ఏ లకు చెబుతున్న …పార్టీ కంటే మనం పెద్ద కాదన్నారు. పార్టీ వీడే ఆలోచన ఉంటే మా MLA లు విరమించుకోవాలని కోరుతున్నా అని హెచ్చరించారు.
Delhi Water Crisis : దీక్షకు దిగిన మంత్రి అతిషి.. ఢిల్లీకి హర్యానా మరింత నీటిని తగ్గించిదని ఆప్ ఆరోపణ