Solve The Problem OU Students: ఓయూలో హాస్టల్లు మూసివేయద్దుని లేడీస్ హాస్టల్ ముందు విద్యార్థినులు రాస్తారోకో చేసారు. హాస్టళ్లు మూసివేస్తే మేము ఎక్కడ ఉండాలి అని విద్యార్థినులు ఓయూ అధికారులను ప్రశ్నించారు. ఓయూ వీసీ వచ్చి మా సమస్య పరిష్కరించాలని విద్యార్థునిల డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో.. ఓయూ గేట్స్ పోలీసులు మూసివేసారు. సెమిస్టర్, దసరా సెలవులు రావడంతో హాస్టల్ మూసివేస్తున్నామని చీఫ్ వార్డెన్ తెలిపినా విద్యార్థినులు ససేమిరా అన్నారు. వీసీ రావాలని సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అయితే.. ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల విద్యార్థినిలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులకు భోజనం సరిగా పెట్టడం లేదని వాపోయిన సంగతిని కూడా వారు తెలిపారు. కాగా.. మెస్ బిల్లులు కట్టినా లిమిటెడ్ గా భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. తాము తిన్న భోజనంలో గాజు పెంకులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు.. ఆ భోజనం తిన్న తమకు ఏమైనా జరిగితే అధికారులే బాధ్యత వహించాలని, బాధ్యులు సీఎం అయినా, వీసీ అయినా బాధ్యత వాళ్లదేనని విద్యార్థులు చెప్పుకొచ్చారు.
Andhra Pradesh Crime: బ్లేడుతో ప్రియుడి మర్మాంగం కోసేసిన ప్రియురాలు.. ఎందుకంత కసి..?
