NTV Telugu Site icon

Apply Vote: ఓటు నమోదుకు మరో మూడు రోజులే చాన్స్‌..

Apply Vote

Apply Vote

Apply Vote: మరికొద్ది నెలల్లో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో మళ్లీ ఓటరు జాబితా సవరణ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. దాంతో పాటు జనవరి 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండిన యువత కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులను డిసెంబర్ 20వ తేదీ 2023 నుంచి జనవరి 5వ తేదీ 2024 వరకు చేపట్టనున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండి ఇంకా ఓటు హక్కు పొందని వారు తమ ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 5వ తేదీ వరకు అవకాశం కల్పించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటరు జాబితా సవరణలో దరఖాస్తు చేసుకున్న వారికి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లభించనుంది. ఓటరు అడ్రస్ మార్చుకునే వెసులుబాటు, వివరాలు సరిచూసుకోవడం, చనిపోయిన, గల్లంతైన వ్యక్తుల ఓట్లను తొలగించే వెసులుబాటు ఉంది.

Read also: Pushpa 2: బాలీవుడ్ లో సలార్ విషయంలో జరిగిన రచ్చనే పుష్ప 2కి జరగబోతుందా?

వచ్చిన దరఖాస్తులను ఈ నెల 6 నుంచి ఫిబ్రవరి 22 వరకు విచారించనున్నారు. https://voters.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఆఫ్ లైన్ ద్వారా తహసీల్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొత్త ఓటర్ల నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు ఎన్నికల సంఘం ఇటీవల అనుమతినిచ్చింది. త్వరలో లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు షెడ్యూల్‌ కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించడంతో పాటు మార్పులు, చేర్పులు చేయనున్నారు. బోగస్ ఓట్ల తొలగింపు, చిరునామా మార్పుతో పాటు ఓటర్ల నమోదు చేసుకోవచ్చు. సిద్ధం చేసిన ఓటరు జాబితా తుది ప్రక్రియ ఫిబ్రవరి 8 నాటికి పూర్తవుతుంది.ఓటు నమోదు కోసం బీఎల్‌ఓలతో పాటు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చు.

షెడ్యూల్ ఇలా..

* జనవరి 5 వరకు కొత్త దరఖాస్తులు, మార్పులు, చేర్పుల స్వీకరణ.
* జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన.
* జనవరి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ.
* జనవరి 22 నుండి ఫిబ్రవరి 1 వరకు, ఏదైనా శనివారం లేదా ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
* ఫిబ్రవరి 2న అభ్యంతరాల పరిశీలన.
* ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రక

ఏ ఫారం ఎందుకు కోసం:

ఫారం-6: కొత్త ఓటరు నమోదు కోసం ఫారం-6ని ఉపయోగించాలి. రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు, ఆధార్ కార్డ్ (లేకపోతే నివాస ధృవీకరణ పత్రం) జతచేయాలి.

ఫారం-6A: NRIలు ఫారం-6Aని ఉపయోగించాలి. దీని కోసం, వారు తమ నివాస దేశంలో పౌరసత్వం లేదని రాయబారితో డిక్లరేషన్ ఇవ్వాలి.
* ఫారం-7: ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు ఫారం-7ను ఉపయోగించాలి. విచారణ తర్వాత పేర్లు తొలగించబడతాయి.
* ఫారం-8 : పేరు, పుట్టిన తేదీలో తప్పులను సరిచేయడానికి ఫారం-8ని ఉపయోగించాలి. పేరు డిక్లరేషన్, 10వ తరగతి మెమో లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఈ ఫారమ్‌లో సరిచేయాలి జతపరచాలి.
* ఫారం-8A : చిరునామా మార్పు కోసం ఫారం-8Aని ఉపయోగించాలి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయిన వారు గత చిరునామా, ప్రస్తుత చిరునామా రుజువుతో కూడిన గుర్తింపు కార్డు జిరాక్స్‌ను జత చేయాల్సి ఉంటుంది.

Show comments