NTV Telugu Site icon

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద

ఎగువ భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. ఇప్పటికే 1 క్రస్ట్ గేటును అధికారులు ఎత్తారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 58,035 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 58,035 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు ప్రస్తుతం నీటి నిలువ 312.0450 టీఎంసీలుగా ఉంది.

ఇదిలా ఉంటే శ్రీశైలం జలాశయానికి పూర్తిగా వరద నీరు నిలిచింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో నిల్‌గా ఉండగా, అవుట్‌ ఫ్లో 76,860 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 871.70 అడుగుల వద్దకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 149.0620 టీఎంసీలుగా ఉంది. అయితే కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.