Site icon NTV Telugu

Hyderabad Rains : హైదరాబాద్‌ లో మళ్లీ భారీ వర్షం..

Rain At Hyderabad

Rain At Hyderabad

Monday Evening Rained At Hyderabad.

గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపోర్లు తుండటం, చెరువులు నిండి వరద నీరు గ్రామాల్లోకి రావడంతో ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు అధికారులు. అంతేకాకుండా వరదతో రైతులు తీవ్ర నష్టపోయారు. వరద నీరు పంటపొలాలపై దండయాత్ర చేయడంతో పత్తి, వరి పంటల రైతులు తీవ్ర నష్టం చవిచూసారు. అయితే రైతన్నలు అదుకోవాలని కోరుతున్నారు.

జలాశయాలకు సైతం వరద నీరు పోటెత్తడంతో నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌, భద్రచంలోని గోదావరి ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవించారు. అయితే గత రెండు రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో ఇప్పుడిప్పుడే ప్రజలకు వరదల నుంచి ఉపశమనం కలుగుతోంది. అయితే.. తాజాగా శనివారం సాయంత్రం ఒక్కసారి హైదరాబాద్‌లో వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, టోలీచౌకీలతో పాటు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.

 

Exit mobile version