NTV Telugu Site icon

Medaram Jatara: మేడారం జాతరకు సీఎం రేవంత్, గవర్నర్ తమిళసై.. ఏ రోజంటే..?

Medaram Cm Revanth Reddy

Medaram Cm Revanth Reddy

Medaram Jatara: తెలంగాణ కుంభమేళా గా పేరొందిన సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మేడారం మహా జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా మేడారం జాతరకు వెళ్లనున్నారు. అదే రోజు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా జాతరకు హాజరవుతారని సమాచారం. ఇతర ప్రముఖులు వస్తున్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సారలమ్మ, పగిద్ద రాజు అడవి నుంచి పొలాలకు చేరుకున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తొలిరోజు మేడారం ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది.

Read also: TDP- Janasena Meeting: నేడు టీడీపీ- జనసేన సమన్వయ కమిటీ భేటీ.. సీట్ల పంపిణీపై కీలక చర్చ

ఈ నెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాట్లను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ.. ఆదివాసీల అతిపెద్ద పండుగ‌ల్లో ఒక‌టైన సమ్మక్క-సారక్క మేడారం జాతర చిర‌కాలం నిలిచిపోయే మ‌న సాంస్కృతిక వారసత్వం యొక్క సజీవ వ్యక్తీకరణ అయిన సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి అభినందనలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం సమాజ స్ఫూర్తి యొక్క గొప్ప కలయిక.. సమ్మక్క-సారక్కలకు నమస్కరిద్దాం.. వారు ఉదహరించిన ఐక్యత మరియు శౌర్య స్ఫూర్తిని స్మరించుకుందాం అన్నారు.
Gold Mine Collapses : వెనిజులాలో కూలిన బంగారు గని.. ప్రాణాలు పొగొట్టుకున్న డజన్ల కొద్ది ప్రజలు