NTV Telugu Site icon

Bogatha waterfall: ఉగ్ర రూపం దాల్చిన భోగత జలపాతం.. పర్యాటకులకు నో ఎంట్రీ

Bhogata Water Fall

Bhogata Water Fall

Bogatha waterfall: తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతం ఉప్పొంగింది. భారీగా నీరు కురుస్తుండటంతో జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు. ప్రకృతి అందాలను చూసి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. సందర్శనకు వచ్చిన పర్యాటకులను అధికారులను వెనక్కిపంపిస్తున్నారు. ప్రమాదాల నివారణకోసం అనుమతులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటకులు భోగత సందర్శనకు రావొద్దని సూచించారు. ప్రమాదం జరిగే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ జలపాతం వద్దకు వెళ్లొద్దని సూచించారు.

Read also: Love Story: ఫేస్ బుక్ లో ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రియురాలి ఎంట్రీ

మరోవైపు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటల సమయంకి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 25.8 అడుగులకు చేరుకుంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే 43 అడుగులకు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గత ఏడాది ఇదే సమయంలో గోదావరి ఉగ్ర రూపంలో ప్రవహించింది.. అయితే అంతటి స్థాయిలో ఇప్పటికిప్పుడు గోదావరికి వరద వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు వస్తున్నప్పటికీ ప్రమాదకర స్థాయిలో మాత్రం వర్షాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరో ఐదు నుంచి పది అడుగుల వరకు గోదావరి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులు వదిలిపెడితే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉన్నట్లుగా సిడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు.
Minister Errabelli: ఎర్రబెల్లి దయాకరరావు క్యాంప్ కార్యాలయంలో కుప్పకూలిన భారీ వృక్షం

Show comments