NTV Telugu Site icon

Drugs in Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..!

Hyderabad Drgas

Hyderabad Drgas

Drugs in Hyderabad: హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువచేసే డ్రగ్స్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. ఐడియా బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇంటర్ పోల్ సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటర్ పోల్ సహాయంతో పీఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 90 కిలోల మెపీడ్రిన్ డ్రగ్స్ ని.. డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. గత పది సంవత్సరాల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకి తరలిస్తున్న కస్తూరి రెడ్డి నల్లపొడి అరెస్టు చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కొంతవరకు హైదరాబాదులో కూడా డ్రగ్స్ సప్లై చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పోల్ సహాయంతో డ్రగ్స్ రాకెట్టు గుట్టురట్టు చేసినట్లు కమలహాసన్ రెడ్డి తెలిపారు. పీఎస్ఎన్ కంపెనీ పలు దేశాలకు డ్రస్సును సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం.

Read also: Delhi Liquor Scam : 18 నెలల్లో 16 మంది అరెస్ట్.. లిక్కరు కేసులో ఇప్పటివరకు జైలుకు వెళ్లింది ఎవరంటే ?

భాగ్య నగరంలో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఉక్కుపాదం మోపుతున్నా.. డ్రగ్‌ రాకెట్లు బయటపడుతూనే ఉన్నాయి. మత్తుకు బానిసగా మారిన యువత ను టార్గెట్‌ చేసుకున్న మాఫియా.. చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నారు.. డబ్బుల కోసం భావితరాల యువతను నాశనం చేస్తున్నారు.. ఉడుకు రక్తం యువత ఆ మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు దేశ ద్రోహులుగా కూడా మారుతున్నారు.. కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాలకు యువతను బానిసలుగా మారుస్తున్నారు.. మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దంటున్నారు పోలీసులు, నిపుణులు. దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత డ్రగ్స్ మాయలో పడటం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతను రక్షించడం కోసమే అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు హైదరాబాద్‌ పోలీసులు చెబుతున్నారు.. ఒకవేళ డ్రగ్స్ కేసులో దొరికితే జీవిత ఖైదు, లేదా ఉరి శిక్షలు ఉంటాయాన్ని పోలీసులు హెచ్చరిస్తున్నారు..
DCP Rohini Priyadarshini: నా సర్వీస్ లో ఇలాంటి మహిళలను చూడలేదు.. డీసీపీ రోహిణీ