గత కొద్ది రోజుల నుంచి పోలీసులు పబ్ లపై దాడులు నిర్వహిస్తున్నా.. రాత్రి సమయంలో పబ్ లలో ఆశ్లీల నృత్యాలు జరుగుతున్నాయి. పబ్ లను సీజ్ చేస్తూ పలువురులను అదుపులో తీసుకుంటున్న పబ్ లలో ఆశ్లీల నృత్యాలు, సమయానికి మించి పబ్ లు నడపడం వంటివి జరుగుతునే వున్నాయి. పబ్‌కు కష్టమర్లను ఆకట్టుకునేందుకు పబ్బుల్లో అశ్లీల నృత్యాలతో గబ్బు రేపుతున్నారు. కొద్దిరోజులుగా పోలీసులు పబ్ ల ఫోకస్ చేయడంతో.. ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. టకీరా, బసేరా, క్లబ్ మస్తీపబ్ లపై దాడులు చేసిన విషయం తెలిసిందే. క్లబ్ లపై వరుసగా దాడులు చేస్తూ నిందితులను అదుపులో తీసుకుంటున్నా మళ్లీ వారిపని వారు చేసుకుంటున్నారు పబ్ యజమానులు. అయితే.. జూన్ 4 న హైదరాబాద్ కెపిహెచ్బి లోని క్లబ్ మస్తీ పబ్ లో అశ్లీల నృత్యాలు మళ్లీ తెరపైకి రావడంతో చర్చనీయాంసంగా మారింది. మరోసారి క్లబ్ మస్తీ పబ్‌లో గలీజు దందాకు అడ్డగా మారింది. గతంలో పోలీసులు దాడులు చేసిన పబ్ నిర్వాహకుల తీరు మాత్రం మారడంలేదు. పబ్ చాటున నిర్వాహకులు పెద్ద ఎత్తున అశ్లీల దందా నిర్వహిస్తున్నారు. యువతులతో రికార్డింగ్ డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు.
Read also: YCP Leaders Politics : జీడీ నెల్లూరులో వైసీపీ నేతల కయ్యాలు..శృతిమించిన విభేదాలు
పబ్ దందాపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందుకూడా ఈ పబ్ లో యువతులతో అశ్లీల దృష్యాలు వెలుగు చూసి, పోలీసులు చర్యలు తీసుకున్నా.. పబ్ యజమానుల తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. సమయానికి మించి పబ్ నడుపుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మండి పడుతున్నారు. తూ.. తూ మంత్రంగా కేసులు రాసి మళ్లీ బెల్ పై బయటకు రావడంతో మళ్లీ సరా మామూలుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి రెండు గంటల వరకు డీజే సౌండ్ లు హోరెత్తిస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. పబ్ యాజమాన్యం యువతులతో నృత్యాలు చేయించి లక్షల రూపాయల డబ్బు దండుకుంటూ అధికారులు మాత్రం చలించకపోవడం విడ్డూరంగా వుందని అన్నారు. వీరిపై చర్యలు తీసుకుని క్లబ్ మస్తీ పబ్ మూసివేయాలని కోరుతున్నారు. క్లబ్ లో శుక్రవారం రాత్రికి మొదలైతే ఆదివారం వరకు ఇలాగే కొనసాగుతున్న ఎవరు పట్టించుకోవడం లేదని మండిపడ్డారుతున్నారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
YCP Leaders Politics : జీడీ నెల్లూరులో వైసీపీ నేతల కయ్యాలు..శృతిమించిన విభేదాలు
