NTV Telugu Site icon

NVSS Prabhakar: ఉత్తమ్ కుమార్ ఎక్కువ మాట్లాడుతున్నారు.. ప్రభాకర్ ఫైర్

Nvss Prabhakar

Nvss Prabhakar

NVSS Prabhakar: ధాన్యం కొనుగోలు విషయంలో ఉత్తం కుమార్ ఎక్కువగా మాట్లాడుతున్నాడని NVSS ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా కూడా ఎన్నికల కోసం మాత్రం ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తన మాటలతో రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం కూడా పంట నష్టం ఇస్తా అని రెండు సార్లు మోసం చేసిందన్నారు. ఇప్పుడు వరి పంట చేతికి వచ్చి ధాన్యం కోసిన తరువాత కొనుగోలు చేయడం లేదన్నారు. ఎన్నికల్లో బోనస్ అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ధాన్యం కొనుగోలు కూడా సరిగా చేయడం లేదని తెలిపారు. రైతు భరోసా కూడా ఎన్నికల కోసం మాత్రం ఇచ్చిందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నని రోజులు లక్ష రూపాయలు రుణ మాఫీ చేస్తామని మోసం చేశాడన్నారు.

Read also: Counterfeit Drugs: సిరిసిల్లలో నకిలీ మందుల కలకలం..

లక్ష రూపాయలు రుణ మాఫీ చేయడానికి కేసీఆర్ కి పది సంవత్సరాలు సరిపోలేదన్నారు. అదలా ఉంటే కాంగ్రెస్ రెండు లక్షల రుణ మాఫీ చేస్తాం అని చెప్పిందన్నారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. ఏరకంగా రుణ మాఫీ చేస్తాడో చెప్పడానికి స్పష్టతలేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని తెలిపారు. సబ్సిడీ విత్తనాలు, ఉచిత పంపిణీ నీ గాలికి వదిలేశారన్నారు. పంట నష్ట పరిహారం ఇవ్వలేని వైనం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఫసల్ బీమా లో రాష్ట్ర వాటా కట్టి ఉంటే కనీసం పంట నష్ట పరిహారం వచ్చేదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఉత్తం కుమార్ ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని గుర్తించాలన్నారు. వెంటనే రైతు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారితో చర్చకు రావాలన్నారు. ఉచిత విద్యుత్ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలు తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చనున్నాయన్నారు.
Conjoined Twins: ఇండోనేషియాలో అరుదైన ఘటన.. 4 చేతులు, 3 కాళ్లతో జన్మించిన కవలలు