NTV Telugu Site icon

ఓ చిన్నారి లేఖకు స్పందించిన ఎన్వీ రమణ

cji nv ramana

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడు గ్రామానికి చెందిన వైష్ణవి అనే చిన్నారి తమ ఊరికి బస్సు సౌకర్యం లేదని, స్కూల్‌ వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ రాసింది. దీంతో భారత సర్వోన్నత న్యాయస్థాన చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ వైష్ణవి రాసిన లేఖకు స్పందించారు.

వెంటనే చిదేడు గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని టీఎస్‌ఆర్టీసీని ఆదేశించారు. ఎన్వీ రమణ ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు చిదేడు గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించారు. ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు బస్సు సౌకర్యాన్ని కల్పించామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. దీంతో ఆ ఊరి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.