Site icon NTV Telugu

నుమాయిష్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది: గవర్నర్‌ తమిళి సై

నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నరర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆమె మాట్లాడారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వివిధ విద్యా సంస్థలకు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. 19 విద్యాసంస్థలలో 30 వేల మంది విద్యార్థులను చదివించడం గొప్ప విషయమని గవర్నర్‌ అన్నారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే ఆదాయం పేద, మధ్య తరగతి అమ్మాయిల చదువుకు ఉపయోగపడుతుందన్నారు.

Read Also:మిఠాయిలు పంచుకున్న భారత్‌-పాక్‌ సైనికులు

నో మాస్క్, నో ఎంట్రీ రూల్ పాటిస్తున్న నిర్వహకులకు నా అభినందనలు అని గవర్నర్‌ అన్నారు. కరోనా ఇంకా మనమధ్యే ఉంది అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్‌కు వస్తున్నారని అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎగ్జిబిషన్‌లో కోవిడ్ టీకా సెంటర్ ఏర్పాటు చేశారు, వ్యాక్సిన్ వేసుకొని వారు టీకా తీసుకోవాలని గవర్నర్‌ కోరారు. 2021 కి ముగింపు పలికి, 2022 కి స్వాగతం పలుకుతున్నాం.అందరిపై దేవుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్న అంటూ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు.

Exit mobile version