నేడే బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం 12.47 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ముందుగా జెండాను ఆవిష్కరించి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కేసీఆర్ తన ఛాంబర్ కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ సెంటర్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనాలని ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలందరినీ పార్టీ అధినేత ఆహ్వానించారు కేసీఆర్ ఢిల్లీకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
మీరాలం చెరువులో మొసళ్ల సంచారం
ఇటీవల మీర్‌ఆలం ట్యాంక్‌లో మొసళ్లు, పాములు సంచరిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ మీర్ ఆలం ట్యాంకులో మొసలి ప్రత్యక్షమైంది. పాత బస్తీలోని మీర్ ఆలం ట్యాంక్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్డును తెరవడంలో జాప్యం చేయడంతో ఆ ప్రాంతం పాములు, తేళ్లు, మొసళ్లకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న , పెద్ద మొసళ్ల గుంపులు అప్పుడప్పుడు సరస్సు సమీపంలోని రాళ్లపై విశ్రాంతి తీసుకుంటూ.. స్థానిక నివాసితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయిన వాపోతున్నారు.
ఆకాశంలో అద్భుతం
నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ప్రతి సంవత్సరం నవంబర్ చివరి నుండి డిసెంబర్ మధ్య వరకు కనిపించే వార్షిక జెమినిడ్స్ ఉల్కాపాతం ఈ సంవత్సరం డిసెంబర్ 14 మరియు 15 రాత్రి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈఏడాదిలో చివరి ఉల్కాపాతం భూమికి అత్యంత సమీపంగా రానున్నంది. ఈనెల 4వ తేదీ నుంచి ఆకాశంలో కనిపిస్తున్న జెమినిడ్స్ ఉల్కాపాతం నేడు రాత్రి గరిష్ఠస్థాయికి చేరుకోనుంది. గరిస్ఠంగా గంటకు 150 ఉల్కలతో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. జెమినిడస్ ఉల్కాపాతం శిథిలాలు సెకనుక 70కిలోమీటర్లు వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించే సందర్భంలో మండిపోతూ ప్రకాశంగా కనిపించనున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడికి నిరసనగా పిలుపు నిచ్చారు. నేడు అన్ని మండలాల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసనలు వెల్లువెత్తునున్నాయి.
ఇండియాలోనే అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేసిన హైదరాబాద్ వాసి
గత ఐదేళ్లలో భారతీయ మార్కెట్‌లో ఇతర దేశాల కార్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. లంబోర్ఘిని, ఆస్టన్, ఫెరారీ వంటి బ్రాండ్‌లు తమ కార్లను మన దేశంలో విక్రయాలు చేస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా మెక్‌లారెన్ ప్రవేశించింది. ఈ బ్రాండ్ ఏడాది క్రితం భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇటీవల ముంబైలో తమ మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ఈ బ్రాండ్ తన ఫ్లాగ్‌షిప్ సూపర్‌కార్ మెక్‌లారెన్ 765 LTని ఆవిష్కరించింది. ఇది భారతదేశంలో అధికారికంగా అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన సూపర్ కార్లలో ఒకటి. మెక్‌లారెన్ ఇప్పటికే తన మొదటి కస్టమర్‌కు కారును డెలివరీ చేసింది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఈ కారును ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ కొనుగోలు చేశారు. అయితే ఈ కారు ఖచ్చితమైన ధర తెలియనప్పటికీ.. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.12 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
విశాఖ, గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వెస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.. నేడు ఓ వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి.. మరో వైపు మాజీ మంత్రి కూతురు పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారు.. నేడు విశాఖ వెళ్లనున్న ఆయన.. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి జంక్షన్ వద్ద నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.. అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరవుతారు ఏపీ సీఎం..
కాంగోలో వరద విలయం.. 120 మంది మృతి
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ ఆఫ్రికా దేశం అతలాకుతలం అవుతోంది. కాంగో రాజధాని కిన్షాసాలో రాత్రంతా కురిసిన వర్షం వల్ల చరిత్రలో ఎప్పుడూ లేని వరదలు వచ్చాయి. దీంతో జనజీవితం స్తంభించిపోయింది. దాదాపుగా 1.5 కోట్ల జనాభా ఉన్న కన్షాసా వరదల వల్ల దెబ్బతింది. నగరంలోని ప్రధాన రహదారులు మునిగిపోయాయి. వరదలు, భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి 120 మంది మరణించారు. రాజధాని కిన్షాసాను ఇతర ప్రాంతాలతో కలిపే రోడ్లు వరద నీటితో మునిగిపోయాయి. అక్కడి ఆరోగ్య మంత్రి జీన్ జాక్వెస్ మాట్లాడుతూ.. మొత్తంగా భారీ వరదల వల్ల 141 మంది మరణించినట్లు వెల్లడించారు. దేశంలో మూడు రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.
భారత్-చైనా సరిహద్దు ఘర్షణలపై స్పందించిన అమెరికా..
భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో ఇరు దేశాల సైనికులు తలపడ్డారు. ఇరు దేశాల సైనికులు ఈ ఘర్షణల్లో గాయపడ్డారు. అయితే ఈ ఘటనలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించింది. తవాంగ్ ప్రాంతం నుంచి ఇరుదేశాల బలగాలు వైదొలగడంపై బైడెన్ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ వెల్లడించారు. వివాదాస్పద సరిహద్దుపై ఇరు దేశాలు ద్వైపాక్షికంగా చర్చించుకోవాలని సూచించింది అమెరికా. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి వివాదాస్పద ప్రాంతం నుంచి చైనా, భారతదేశాల తమ బలగాలను ఉపసంహరించుకోవాలని కోరారు.
రోజులో 8గంటలే గ్యాస్ సరఫరా
పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీ తీవ్ర గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో రోజులో ఎనిమిది గంటలు మాత్రమే గ్యాస్ సరఫరా చేయగలమని సెమీ గవర్నమెంట్ నేచురల్ గ్యాస్ ప్రొవైడర్ కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశీయ వినియోగదారుల కష్టాలు పెరిగాయి. సుయ్ సదరన్ గ్యాస్ కంపెనీ (SSGC) ఇప్పుడు కరాచీలోని గృహ వినియోగదారులకు భోజన సమయం అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మొత్తం మీద రోజులో 8 గంటలు మాత్రమే గ్యాస్ సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. కరాచీలో నెలరోజులుగా గ్యాస్ వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుతం, కంపెనీ తీసుకున్న నిర్ణయంతో దేశీయ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ప్రధాని సూచనల మేరకే గ్యాస్ సరఫరాపై ఈ ప్రకటన విడుదల చేసినట్లు కంపెనీ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ లో గ్యాస్ నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. పెరుగుతున్న జనాభా కారణంగా ఇంధనానికి డిమాండ్ బాగా పెరిగింది. గత ఇరవై ఏళ్లుగా కొత్త గ్యాస్ నిల్వలను కనుగొనకపోవడం వల్ల సరఫరా తగ్గుతోంది. దేశం ప్రస్తుతం 44:56 నిష్పత్తిలో దిగుమతి చేసుకున్న స్వదేశీ వనరుల ద్వారా దాని ఇంధన అవసరాలను తీరుస్తుంది.
Football Player: ఇరాన్ సంచలన నిర్ణయం.. ఫుట్‌బాల్ ఆటగాడికి మరణశిక్ష