NTV Telugu Site icon

ముగ్గురు కాంగ్రెస్ నేతలపై నాన్‌ బెయిలబుల్ వారెంట్…

Congress

ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ కేసు నమోదయ్యింది. బలరాంనాయక్, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిపై ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది కోర్టు. వీరి పై హనంకొండలో అనుమతి లేకుండా ప్రదర్శన చేశారని 2018లో కేసు నమోదయ్యింది. కానీ ఈ కేసు విచారణకు హాజరుకానందున ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి హాజరుపరచాలని కోర్టు తెలిపింది. అయితే ఎన్‌బీడబ్ల్యూ జారీతో కోర్టుకు హాజరయ్యారు బలరాం నాయక్. దాంతో బలరాంనాయక్‌పై ఎన్‌బీడబ్ల్యూ ఉపసంహరించింది కోర్టు. తదుపరి విచారణ సెప్టెంబరు 3కి వాయిదా వేసింది ప్రజాప్రతినిధుల కోర్టు