Site icon NTV Telugu

థియేటర్లపై ఆంక్షలు ఉండవు: మంత్రి తలసాని శ్రీనివాస్‌

కరోనా కారణంగా థియేటర్లపై ఆంక్షలువ విధిస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. సీని పరిశ్రమకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు తీసుకోలేమని ఆయన తెలిపారు.ఇప్పటికే కరోనా కారణంగా గత రెండేళ్లుగా సీని పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతుందని తెలిపారు. సినిమా పరిశ్రమను నమ్ముకుని ఎందరో ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. వారి ఉపాధిపైన దెబ్బకొట్టలేమని మంత్రి వెల్లడించారు.

మొదటి లాక్‌ డౌన్‌తో పరిశ్రమలోని ఎంతోమంది కార్మికులు పస్తులు ఉన్నారని ఆయన అన్నారు. ప్రజలు భయపడకుండా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలన్నారు. రాష్ర్టంలో సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించబోమని, ఎక్కడో ఎవరో సినిమా టికెట్ల ధరలు తగ్గించారని మేం తగ్గించమని ఆయన చెప్పారు. లక్షలాది మందికి ఉపాధిని ఇచ్చే సినిమా పరిశ్రమపై ఇప్పట్లో ఆంక్షలు పెట్టబోమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు.

Exit mobile version