NTV Telugu Site icon

Cantonment By Election: కంటోన్మెంట్ కి ఉప ఎన్నిక లేనట్టే.. ఎందుకంటే?

sayanna

Collage Maker 20 Feb 2023 07.36 Am

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న ఆదివారం కన్నుమూశారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో ఒక సీటు ఖాళీ అయింది. అయితే ఆ సీటుకి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. నేడు బన్సీలాల్‌పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు వెల్లడించారు. సాయన్నకు భార్య గీత, ముగ్గురు కుమార్తెలు నమ్రత, లాస్య నందిత, నివేదిత ఉన్నారు. వీరిలో లాస్య నందిత గతంలో జీహెచ్‌ఎంసీ కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 1951 మార్చి 5న జన్మించిన సాయన్న.. డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.

సిండికేట్‌ బ్యాంక్‌ ఉద్యోగిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీలో చేరారు. 1986లో గా బల్దియా ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసిన సాయన్న ఓడిపోయారు. అనంతరం 1994లో ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1999, 2004లో కూడా కంటోన్మెంట్‌ నుంచి సైకిల్‌ గుర్తుపై పోటీ చేసి హ్యాట్రిక్‌ విజయాలతో రికార్డు సృష్టించారు. 1999లో ఓడిపోయారు. అయితే 2014 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2016లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

Read Also:Somavathi Amavasya Bhakthi Tv Live: సోమవతి అమావాస్య నాడు ఈ పూజచేస్తే..

ఇదిలా ఉంటే..కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న ఆదివారం కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక ఉంటుందని అంతా భావించారు. కానీ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌లు ఉండ‌వు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 151A ప్రకారం, ఎన్నికల సంఘం కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక నిర్వహించదు. ఈ చట్టం ప్రకారం జి. సాయన్నకు ఎమ్మెల్యేగా ఏడాది పదవీ కాలం లేదు కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు. సాయన్న ఎమ్మెల్యేగా పదవీకాలం కేవలం తొమ్మిది నెలలే మిగిలి ఉంది.

సాధారణంగా, ఒక ఎమ్మెల్యే మరణించిన లేదా రాజీనామా చేసిన తర్వాత ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఎమ్మెల్యే పదవీకాలం ఏడాది కంటే తక్కువ ఉంటే లేదా ఉప ఎన్నిక నిర్వహించే స్థితిలో EC లేనట్లయితే ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించదు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని 151A ప్రకారం, సెక్షన్ 147, 149, 150 మరియు 151లో పేర్కొన్న ఖాళీల భర్తీకి కాల పరిమితి ఇలా చెబుతోంది.

“సెక్షన్ 147, సెక్షన్ 149, సెక్షన్ 1151 మరియు సెక్షన్ 1151, ఏదైనా ఖాళీని భర్తీ చేయడానికి ఉప ఎన్నిక పేర్కొన్న విభాగాలు ఖాళీ ఏర్పడిన తేదీ నుండి ఆరు నెలల వ్యవధిలో నిర్వహించబడతాయి, అయితే ఈ విభాగంలో ఉన్న ఏదీ వర్తించదు (ఎ) ఖాళీకి సంబంధించి సభ్యుని యొక్క మిగిలిన పదవీకాలం – cy ఒక సంవత్సరం కంటే తక్కువ; లేదా (బి) ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చెప్పిన వ్యవధిలో ఉప ఎన్నికలను నిర్వహించడం కష్టమని ధృవీకరిస్తుంది. BRS ప్రభుత్వ పదవీకాలం డిసెంబర్ 13తో ముగుస్తుంది. అంటే సాయన్న తన పదవీకాలంలో ఒక సంవత్సరం కూడా నిండదు కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎలాంటి ఉప ఎన్నికలు నిర్వహించదు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఒకటి తగ్గనుంది.

Read Also: Celebrities Heart Strokes: పునీత్ నుంచి తారకరత్న దాకా.. 18నెలల్లో ఏడుగురు మృత్యువాత